పవన్ ప్రయత్నాలు ఫలిస్తాయా ? సీమలో సీన్ మారుస్తారా ?  

Pawan Kalyan Ralaseema Tour-pawan Kalyan,pawan Kalyan Comments On Jagan Mohan Reddy,pawan Kalyan Recently Visit In Rayalaseema

రాయలసీమ జిల్లాల్లో తన పట్టు పెంచుకునేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు.వైసీపీకి కంచుకోటగా ఉన్న రాయలసీమలో పట్టు పెంచుకోవడం ద్వారా జగన్ హవాకు బ్రేక్ వేయాలని పవన్ ఆలోచనగా కనిపిస్తోంది.అందుకే రాయసీమలో ప్రధానంగా ఉన్న సమస్యలన్నిటినీ హైలెట్ చేసి ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరిగిలా చేసేందుకు పవన్ ప్రయత్నిస్తున్నాడు.ఐదు రోజుల పాటు రాయలసీమలో పవన్ పర్యటన పెట్టుకున్నారు.

Pawan Kalyan Ralaseema Tour-pawan Kalyan,pawan Kalyan Comments On Jagan Mohan Reddy,pawan Kalyan Recently Visit In Rayalaseema Telugu Political Breaking News - Andhra Pradesh,Telangana Partys Coverage-Pawan Kalyan Ralaseema Tour-Pawan Pawan Comments On Jagan Mohan Reddy Recently Visit In Rayalaseema

ముఖ్యమంత్రి జగన్ సొంత జిల్లా కడపలోనే ఎక్కువగా పర్యటిస్తున్నారు.రాయలసీమ ప్రస్తుతానికి వైసీపీకి కంచుకోటలాగా ఉంది.అంతకు ముందు కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ బాగా ఆదరణ కనిపించేది.ఒక్క అనంతపురం జిల్లాలో మాత్రం అప్పుడప్పుడూ తెలుగుదేశం పార్టీ తన ఆధిపత్యం చూపించేది.

జగన్ వైసీపీని స్థాపించిన తరువాత సీమ జిల్లాలు వైసీపీ వైపు మొగ్గు చూపించాయి.2014 ఎన్నికల్లో అనంతపురం జిల్లాలో మాత్రమే టీడీపీకి ఎక్కువ సీట్లు దక్కాయి.ఈ ఎన్నికల్లో సీమ మొత్తం వైసీపీ క్లిన్ స్వీప్ చేసింది.

సీమ జిల్లాల్లోనూ 52 అసెంబ్లీ సీట్లలో వైసీపీ 49 స్థానాలను దక్కించుకుని తమ బలం ఏంటో నిరూపించుకుంది.ఇక్కడ దాదాపుగా అన్ని ఎంపీ సీట్లనూ గెలుచుకుంది.

అందుకే ఇక్కడ ముందు ముందు వైసీపీ ప్రభావం పెద్దగా లేకుండా చేయాలని పవన్ కంకణం కట్టుకున్నారు.ఇక్కడ నెలకొన్న ప్రధాన సమస్యలన్నిటినీ హైలెట్ చేయడం ద్వారా తన పరపతి పెంచుకోవడంతో పాటు జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచాలని పవన్ చూస్తున్నాడు.ఈ మేరకు ఆదివారం ఆయన కడప జిల్లా రైల్వే కోడూరులో రైతులతో సమావేశమయ్యారు.రాయలసీమ సారవంతమైన నేల అని, ఈ ప్రాంతాన్ని నాయకులే కరువు పీడిత ప్రాంతంగా మార్చారని పవన్ కళ్యాణ్ విమర్శలు చేసారు.

సీమ రైతుల గురించి జగన్ ఆలోచించరని, రైతులు బాగుపడితే తనను ఎవరూ పట్టించుకోరనేది జగన్ బాధ అంటూ సెంటిమెంట్ రగిల్చే పనికి శ్రీకారం చుట్టారు.జగన్ ది ఫ్యాక్షనిస్ట్ నేపధ్యమని మండిపడ్డారు.

సీమ ప్రజల కష్టాలపై, రైతుల సమస్యలపై త్వరలోనే ప్రధానమంత్రి నరేంద్ర నరేంద్ర మోదీకి లేఖ రాస్తానని పవన్ కళ్యాణ్ చెప్పారు.ఇక, జగన్ కొంతమందికే ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారు కాబట్టే తాను జగన్ ను జగన్ రెడ్డి అని పిలుస్తున్నానని చెప్పారు.

అంటే జగన్ రెడ్డి సామజిక వర్గానికి మాత్రమే అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే భావనను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తున్నారని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.సీమ జిల్లాల్లో ప్రభావం చూపించే స్థాయిలో ఉన్న కాపు – బలిజ సామజిక వర్గాలను తనవైపు తిప్పుకునేందుకు పవన్ భావిస్తున్నట్టు అర్ధం అవుతోంది.గతంలో ప్రజారాజ్యం పార్టీని స్థాపించినప్పుడు చిరంజీవి తన సొంత ప్రాంతమైన పాలకొల్లు లో ఓడిపోయినా రాయలసీమలోని తిరుపతిలో గెలవడానికి ఇక్కడ ఆ సామాజికవర్గ ఓటర్లు అధిక సంఖ్యలో ఉండటమే కారణమనే విశ్లేషణలు ఉన్నాయి.అయితే ఇక్కడ ఇప్పుడు వైసీపీ హవానే ఎక్కువగా ఉండడంతో దాన్ని తగ్గించేందుకు పవన్ ప్రయత్నాలు చేస్తున్నాడు.