పవన్ ప్లాన్ అదేనా ?  

Why Pawan Prefers Young Directors? -

పవన్ కళ్యాణ్ అంటే కేవలం నటుడే కాదు, పవన్ లో ఒక డ్యాన్స్ మాస్టర్, ఒక ఫైట్ మాస్టర్, ఒక రచయిత, ఒక దర్శకుడు … ఇంతమంది దాగున్నారు.కాస్ట్యూమ్స్ డిజైన్ సొంతంగా చేయకపోయినా, తాను సినిమాలో ఎలాంటి డ్రెస్ వేసుకోవాలి అనేది డిసైడ్ చేసేది పవనే.

Source:TeluguStop.com.ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరుTeluguStop.com

TeluguStop.com - Why Pawan Prefers Young Directors--Telugu Tollywood Photo Image

ఖుషి, బద్రి, జాని, గుడుంబా శంకర్ సినిమాల్లోని పవన్ కాస్ట్యూమ్స్ ఎలాంటి ట్రెండ్ క్రియేట్ చేసాయో మనందరికి తెలిసిందే.అలాగే సొంతంగా మాటలు రాసుకోవడం, డ్యాన్స్సులు కంపోజ్ చేసుకోవడం, ఫైట్స్ కంపోజ్ చేసుకోవడం కూడా పవన్ కి అలవాటే.

కొంతమంది దీన్నీ మల్టిటాలెంట్ అంటారు.మరికొంతమంది వేలుపెట్టడం అంటారు.

ఇప్పుడు సర్దార్ గబ్బర్ సింగ్ కథ పవన్ కళ్యాణ్ దే.సెట్లో దర్శకుడు బాబి కన్నా పవన్ పాత్రే పెద్దది అనీ చాలా పుకార్లు ఉన్నాయి.పెద్ద దర్శకులతో అయితే పవన్ ఇష్టారాజ్యం నడవదు.కెమెరామెన్ గంగతో రాంబాబు సమయంలో పవన్ కి పూరికి గొడవలు జరిగిన సంగతి విదితమే.అదే చిన్న దర్శకులైతే ఎదురుతిరిగి మాట్లాడలేరు.అందుకోసమే బాబి,డాల్లి,జాని,సంతోష్ శ్రీనివాస్, ఎస్ జే సూర్య లాంటి దర్శకులకి పవన్ అవకాశాలు ఇస్తున్నాడు అన్నది సినీవిశ్లేశకుల భావన.

ఆ క్రియేటివిటి లేదా వేలుపెట్టడం వల్ల ఖుషి పెద్ద హిట్ అయ్యింది, గబ్బర్ సింగ్ కూడా ఓ రెంజ్ బ్లాక్బస్టర్ అయ్యింది.మరోవైపు తీన్మార్,గుడుంబా శంకర్, జాని లాంటి డిజాస్టర్స్ కూడా ఉన్నాయి.

మరి సర్దార్ గబ్బర్ సింగ్ కి ఏ లిస్టులో స్థానం దక్కుతుందో!

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు