ప్రీ-లుక్‌తో ఆట మొదలుపెట్టిన పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ఎప్పుడెప్పుడా అని చిత్ర వర్గాలతో పాటు ప్రేక్షకులు, అభిమానుల చాలా రోజుల నుండి ఆతృతగా ఎదురుచూస్తున్నారు.బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘పింక్’ను తెలుగులో రీమేక్ చేస్తున్న పవన్, ఈ సినిమాలో ఎలాంటి గెటప్‌లో కనిపిస్తాడా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.

 Pawan Kalyan Pre Look From Pspk26-TeluguStop.com

కాగా గతకొద్ది రోజులుగా ఈ సినిమా ఫస్ట్ లుక్‌కు సంబంధించి పలు వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

అయితే ఈ వార్తలన్నింటినీ పటాపంచలు చేస్తూ పవన్ కళ్యాణ్‌కు సంబంధించిన ఫస్ట్ లుక్ గురించి తాజాగా చిత్ర యూనిట్ ఓ అనౌన్స్‌మెంట్ చేసింది.

ఈ సినిమాలో పవన్ ఫస్ట్ లుక్‌ను మార్చి 2న సాయంత్రం 5 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.ఈ ప్రీలుక్‌ పోస్టర్‌ను చిత్ర యూనిట్ సోషల్ మీడియాలో కొద్దిసేపటి క్రితం పోస్ట్ చేయడంతో ప్రస్తుతం అది వైరల్‌గా మారింది.

ఈ ప్రీ-లుక్ పోస్టర్‌లో పవన్‌ జేబులో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళుతున్నాడు.

Telugu Dil Raju, Pawan Kalyan, Pre, Pspk, Telugu, Venu Sriram-Movie

తొలిసారి లాయర్‌ పాత్రలో పవన్ కనిపిస్తుండటంతో ఈ సినిమా కోసం పవన్ ఫ్యాన్స్‌తో పాటు ఇండస్ట్రీ వర్గాలు కూడా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.ఇక ఈ సినిమాను వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేస్తుండగా స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్నాడు.నివేదా థామస్, అంజలి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా మే నెలలో ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube