పవన్ 'పవర్' సరిపోవడంలేదా ..? ఇంకా రాజకీయ క్లారిటీ రాలేదా ..?

పూర్తిస్థాయి రాజకీయాల్లోకి అడుగుపెట్టినా పవన్ కళ్యాణ్ లో ఇంకా రాజకీయ క్లారిటీ రాలేదనిపిస్తోంది.పార్ట్ టైం పొలిటీషియన్ అనే ముద్ర వేయించుకున్న ఆయన ఇంకా ఆ ముద్ర చెరుపుకునే ప్రయత్నం అయితే చేయడంలేదు.

 Pawan Kalyan Power In Politics-TeluguStop.com

పైగా ఏపీలో 175 నియోజకవర్గాల్లోనూ తాను పోటీ చేస్తానని ధీమాగా ప్రకటించేశాడు.అయితే ఆ మేరకు మాత్రం ఎక్కడా కృషి చేస్తున్నట్టు కనిపించడంలేదు.

సంస్థాగతంగా ఇప్పటి వరకు జిల్లా స్థాయిల్లో పూర్తి స్థాయి కమిటీలు ఏర్పరచకపోవడం, గ్రాస్ రూట్, బూత్ స్థాయి కమిటీలు లేకపోవటం, కేవలం తన అభిమానులపైనే పవన్ కల్యాణ్ ఆధారపడడం వంటివి ప్రస్తుత రాజకీయాల్లో మైనస్ పాయింట్లుగా కనిపిస్తున్నాయి.ఏపీలో ఇప్పటికే గ్రామస్థాయి కమిటీల ఏర్పాటు, పార్టీ ప్రచారం, ఓటర్లతో టీడీపీ కార్యకర్తలు, నాయకులు మమేకమవడం వంటి కార్యక్రమాల్లో ఆ పార్టీ బిజీగా ఉంది.చాపకింద నీరులా టీడీపీ ఎన్నికల్లో ఓట్లు దండుకునే కార్యక్రమంలో వైసీపీ కన్నా ముందుంది.

ఇక జగన్ విషయానికి వస్తే… గత ఎన్నికల్లో అతితక్కువ ఓటింగ్ శాతం తో అధికారం దూరం చేసుకున్న జగన్ ఈసారి ఆ తప్పు జరగకుండా చూసుకోవాలని చూస్తున్నాడు.

అందుకే.ప్రజా సంకల్ప యాత్రలుచేస్తూ జనంలో తన హవా పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు.కానీ పవన్ మాత్రం ఎక్కడా ఆ స్పీడ్ అందుకోవడం లేదు.
ఏపీలో ఉన్న 175 అసెంబ్లీ స్థానాల్లో ఏ నియోజకవర్గంలో ఎన్ని బూత్ పాయింట్లు ఉన్నాయో తెలియని పరిస్థితుల్లో జనసేన ఉంది.

పవన్ తన చుట్టూ ఉన్న అభిమానులను చూసుకుని మురిసిపోతే ఏమాత్రం లాభం ఉండదు.ఆయా ప్రాంతాల్లో అభ్యర్థుల ఎంపిక, బూత్ స్థాయి కమిటీల ఏర్పాటు, నిధులు – విధులు వంటివి, కార్యకర్తలకు అప్పగిస్తూ పార్టీని బలోపేతం చేయాలి తప్ప సినిమా డైలాగులు చెప్పి ఊరుకుంటే రాజకీయాల్లో వెనుకబడిపోవాల్సిందే.పోనీ ఆయన ఓధాలు పెట్టిన యాత్ర అన్నా సక్రంగా చేస్తున్నాడా అంటే అదీ లేదు.ఎప్పుడూ ఏదో ఒక వంక చెప్పి యాత్రకు బ్రేకులు వేస్తూనే ఉన్నాడు.

ఎన్నికల సమయం ముంచుకొస్తున్న ఈ కీలక సమయంలో పవన్ స్పీడ్ పెంచకపోతే ఇక ఆ తరువాత పార్టీనే మూసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube