మార్పు కావాలంటే ఓర్పు అవసరం అంటున్న పవన్ కళ్యాణ్

ఏపీ రాజకీయాలలో సుదీర్ఘ రాజకీయ లక్ష్యంతో అడుగుపెట్టిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన మొదటి ఎన్నికలలోనే భారీ ఓటమి చవిచూశారు.ఇక తాను కూడా పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయాడు.

 Pawan Kalyan Political Speech Impressed In Students Meet-TeluguStop.com

ఓ విధంగా ఏపీలో భారీ స్టార్ ఇమేజ్ ఉన్న పవన్ కళ్యాణ్ లాంటి నటుడుకి ఇది కాస్తా అవమానకరమనే చెప్పాలి.అయిన కూడా తన రాజకీయ లక్ష్యంలో భాగమైన జనసేనాని ఓటమిని పక్కన పెట్టి మరల వెంటనే తన ప్రయాణం మొదలెట్టాడు.

ప్రభుత్వ వైఫల్యాలని ఎండగట్టడం మొదలెట్టాడు.ఓ విధంగా దీనిని ఎవరూ ఊహించలేదు.

అయితే పవన్ వేగాన్ని తట్టుకోవడానికి అధికార పార్టీ అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుంది.ఇదిలా ఉంటే తాజాగా తన రాజకీయ ప్రయాణం, అవరోధాలపై జనసేనాని విజ్ఞాన్‌ భవన్‌లో జరిగిన ఇండియన్‌ స్టూడెంట్స్‌ పార్లమెంట్‌ సదస్సులో తెలియజేశారు.

దేశ రాజకీయాల్లో మార్పు కావాలని కోరుకుంటే సహనం కావాలని నిర్మాణాత్మక ఆలోచనలు, కార్యాచరణతో లక్ష్యాలు నెరవేరుతాయని తెలిపారు.యువత క్షేత్రస్థాయి వాస్తవాలను అనుభవం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేయాలని సూచించారు.

ఇన్‌ స్టెంట్‌ న్యూడిల్స్‌ తరహాలో వెంటనే ఫలితం ఆశించడం సరైన పద్ధతి కాదని మార్పు రావాలంటే ఓర్పు అవసరమని సూచించారు.తన లక్ష్యం కోసం కృషి చేస్తూనే దేశ సేవకు కట్టుబడి ఉన్నట్లు తెలిపారు.

దేశానికి ఎంతో కొంత సేవ చేయాలన్న తపనతో రాజకీయాల్లోకి వచ్చినట్లు చెప్పారు.తాను పోటీ చేసిన రెండు స్థానాల్లో ఓడిపోయినా, రాజకీయ ప్రస్థానాన్ని ఆపలేదని అన్నారు.

ఈ నా ప్రయాణంలో తాను కోరుకున్న మార్పు వచ్చే వరకు తన సుదీర్ఘ రాజకీయ ప్రయాణం సాగుతూనే ఉంటుందని తెలిపారు.ఇండియన్ స్టూడెంట్ పార్లమెంట్ లో పవన్ సందేశం రాజకీయాలలోకి రావాలనుకునే యువతకి దారి చూపే విధంగా ఉందని సోషల్ మీడియాలో ప్రశంసలు లభిస్తున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube