పవన్..కోసం క్రిష్ పొలిటికల్ సినిమా సిద్దం   Pawan Kalyan Politcal Movie With Director KRISH     2017-10-28   02:34:27  IST  Raghu V

పవన్ త్వరలో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వెళ్ళడానికి సిద్దంగా ఉన్నారు..అయితే పవన్-తివిక్రం ల సినిమా తరువాత వేరే ఎటువంటి సినిమా ఉండదు పూర్తిగా రాజకీయాలకే పరిమితం అవుతారు అనే వాదనలు వినిపించాయి.జనసేన నాయకులు కూడా అదే అభిప్రాయాన్ని వెల్లడించారు.అయితే..ఇప్పుడు పవన్ చేస్తున్న త్రివిక్రమ్ సినిమా తరువాత మరొక సినిమాకి ఒప్పుకున్నాడు అని టాక్. ఆ సినిమాకూడా పూర్తిచేసి అప్పుడు పూర్తిగా రాజకీయాల్లోకి అడుగుపెడుతాడు అని తెలుస్తోంది.అయితే ఆ సినిమా మాత్రం చాలా వేగంగా జరిగిపోవాలని పవన్ కండిషన్ పెట్టాడట.

ఇక పవన్ తర్వాతి సినిమాకోసం.. ఇప్పటికే తమిళ దర్శకుడు ఆర్.టి. నీసన్, తెలుగు యంగ్ డైరెక్టర్ సంతోష్ శ్రీనివాస్‌లు సిద్ధంగా ఉన్నారు. అయితే ఈ భాద్యతలని సినిమాలని ఎంతో గొప్పగా..ప్రేక్షకులకి చేరువచేసేలా విభిన్నంగా తెరకెక్కించే క్రిష్ కి అప్పగించాడు అని తెలుస్తోంది…ఎందుకంటే ..పొలిటికల్ గా మైలేజ్ వచ్చే మంచి కాన్సెప్ట్ తో ముందుకొచ్చిన క్రిష్ వైపే మొగ్గుచూపుతున్నాడట పవన్.

సమాజానికి ఉపయోగపడే ఎన్నో విలువలతో కూడిన అంశాలని ఒందిగ్గా చేసి..ప్రజలకి ఎంతో సామాజిక అంశాలతో సందేశాత్మక సినిమాలను తెరకెక్కించే క్రిష్.. పవన్ కోసం అలాంటి కథనే సిద్ధం చేస్తున్నాడట. ‘కంచె’, ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ వంటి పీరియాడికల్ సినిమాలను రికార్డ్ టైమ్‌లో తెరకెక్కించిన క్రిష్.. ఇప్పుడు పవర్ స్టార్ సినిమాను కూడా కేవలం మూడు నెలల్లోనే పూర్తి చేయనున్నాడట. కంగన రనౌత్‌తో చేస్తోన్న ‘మణికర్ణిక’ మరో రెండు నెలల్లో పూర్తయిపోనుండడంతో..ఇక పవన్-క్రిష్ కాంబినేషన్‌లో రూపొందే సినిమాను.. భవ్య క్రియేషన్స్ బ్యానర్‌లో వి.ఆనంద్ ప్రసాద్ నిర్మించే అవకాశం ఉందట. మొత్తంమీద..సినిమాల నుంచీ రాజకీయాల్లోకి వెళ్ళే ప్రతీ ఒకరు ఎన్నికల సమయంలో తప్పనిసరిగా ఎదో ఒక పొలిటికల్ టచ్ ఇచ్చే సినిమాలని చేస్తూ జనంలోకి వెళ్తారు..మరి పవన్ సినిమా ఎలా ఉండబోతుందో తెలియలి అంటే కొన్నిరోజులు వెయిట్ చేయాల్సిందే.