లోడ్ అవుతున్న ఫస్ట్ లుక్.. పవర్ చూపించేందుకు వకీల్ సాబ్ రెడీ  

Pawan Kalyan Pink Remake First Look Loading - Telugu First Look, Lawyer Saab, Pawan Kalyan, Pink Remake, Pspk26, Vakeel Saab

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ పింక్‌ను తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే.వేణు శ్రీరామ్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి ఎప్పుడు ఎలాంటి అప్‌డేట్ వచ్చినా ప్రేక్షకులు తప్పకుండా ఫాలో అవుతున్నారు.

Pawan Kalyan Pink Remake First Look Loading

కాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను అతి త్వరలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

ఇప్పటికే ఈ సినిమాకు లాయర్ సాబ్, వకీల్ సాబ్ అనే టైటిల్స్ పరిశీలనలో ఉండగా లాయర్ సాబ్ అనే టైటిల్‌ను దాదాపుగా ఖరారు చేసినట్లు తెలుస్తోంది.

కాగా ఈ సినిమాలో పవన్ లుక్‌తో పాటు టైటిల్‌ను కూడా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.ఈ పోస్టర్‌ ప్రస్తుతం లోడ్ అవుతుందంటూ చిత్ర యూనిట్ అఫీషియల్‌గా తెలిపింది.

ఇక ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండటంతో ఈ సనిమాపై భారీ అంచనాలు క్రియేట్ అవుతున్నాయి.

దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాలో నివేదా థామస్, అంజలి హీరోయిన్లుగా నటిస్తున్నారు.

మార్చి 2న ఈ చిత్ర టైటిల్ పోస్టర్, ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది.ఇక సోషల్ మీడియాలో పవన్ ఫస్ట్ లుక్‌కు సంబంధించిన హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్‌లో నడుస్తోంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

footer-test