బండ్లన్న ఇంట్లో పవన్ అన్న.. అలా బయటపడ్డ నిజం?

తెలుగు సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ గురించి తెలుగు ప్రేక్షకులందరికి పరిచయమే.ఇక తను నటుడిగా, నిర్మాతగా కంటే ఎక్కువ గుర్తింపును పవన్ కళ్యాణ్ వీరాభిమానిగా తెచ్చుకున్నాడు.

 Pawan Kalyan Pic In Bandla Ganesh Goes Viral-TeluguStop.com

ఈయన పవన్ కి చూపించే అభిమానం మాత్రం అంతా ఇంతా కాదు.ఏదైనా సమావేశంలో ఈయన మాట్లాడితే చాలు.

అందులో పవన్ గురించి తీయకుండా ఉండడనే చెప్పాలి.అంతేకాకుండా పవన్ దేవుడని తన భక్తుడని ఎన్నోసార్లు చెప్పాడు.

 Pawan Kalyan Pic In Bandla Ganesh Goes Viral-బండ్లన్న ఇంట్లో పవన్ అన్న.. అలా బయటపడ్డ నిజం-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటూ నిత్యం పవన్ కు సంబంధించిన ఫోటోలను బాగా పంచుకుంటాడు.ఇదిలా ఉంటే తాజాగా ఆయన ఇంట్లో పవన్ ఫోటో వైరల్ గా మారింది.

ఇటీవలే తన సోషల్ మీడియా వేదికగా పవన్ కళ్యాణ్ పాత ఫోటోలను, చిన్ననాటి ఫోటోలను బాగా షేర్ చేసుకున్నాడు.అంతే కాకుండా పవన్ కు దేవర అని మరో కొత్త పేరు పెట్టగా.

ఇకపై పవన్ కళ్యాణ్ ను దేవర అని పిలుచుకుంటాను అని గట్టిగా చెప్పుకున్నాడు.ఇటీవలే ఓ రియాలిటీ షోలో కూడా పాల్గొనగా అక్కడ కూడా పవన్ గురించి ఓ రేంజ్ లో పొగిడాడు.

అంతేకాకుండా త్వరలోనే పవన్ తో మరో సినిమా తీస్తా అని కూడా తెలిపాడు.ఇక ఈయన అభిమానాన్ని చూసి కొందరు భజన అని అనుకుంటారు.ఇక పవన్ అభిమానులు మాత్రం బండ్లను బాగా ఫాలో అవుతుంటారు.

Telugu Bandla Ganesh, Bandla Ganesh And Pawan Kalyan, Devara, Pawan Kalyan, Pawan Kalyan Fan, Pawan Kalyan Pic, Producer Bandla Ganesh, Social Media, Viral Photo-Movie

ఇక తాజాగా బండ్ల తన సోషల్ మీడియా వేదికగా ఓ ఫోటో పంచుకున్నాడు.అందులో తెలుగు రాష్ట్రాల బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ ఆండ్రు ఫ్లెమింగ్ తో ఫోటో దిగుతూ కనిపించాడు బండ్ల.అది కూడా బండ్ల ఇంట్లో అన్నట్లు కనిపించగా.

అతడికి అతిధి మర్యాదలు చేశారు.

Telugu Bandla Ganesh, Bandla Ganesh And Pawan Kalyan, Devara, Pawan Kalyan, Pawan Kalyan Fan, Pawan Kalyan Pic, Producer Bandla Ganesh, Social Media, Viral Photo-Movie

ఇక ఈ ఫోటో సంగతి పక్కన పెడితే వీరు ఫోటో దిగిన బ్యాక్ గ్రౌండ్ లో పవన్ కళ్యాణ్ ఫోటో బాగా వైరల్ గా మారింది.అందులో బండ్ల గబ్బర్ సింగ్ సినిమా సమయంలో పవన్ కళ్యాణ్ తో దిగిన ఫోటోను తన ఇంట్లో పెట్టుకోగా ఈ ఫోటోను చూసిన పవన్ అభిమానులు తెగ లైక్స్ చేస్తున్నారు.అంతేకాకుండా బండ్లకు పవన్ మీద ఉన్న అభిమానం గురించి తెగ పొగుడుతున్నారు.

#Pawan Kalyan #Bandla Ganesh #Bandla Ganesh #Pawan Kalyan #BandlaGanesh

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు