యంగ్ హీరో నితిన్ కు అభిమాన హీరో ఎవరు అంటే చిన్న పిల్లల నుండి పెద్దల వరకు అంతా ఠక్కున చెప్పే పేరు పవన్ కళ్యాణ్.చిన్నప్పటి నుండి కూడా పవన్ ను చూస్తూ పెరిగాను నాకు పవన్ అంటే చాలా ఇష్టం అంటూ పదే పదే చెప్పే నితిన్ తన ప్రతి సినిమాలో కూడా ఏదో ఒక విధంగా పవన్ కళ్యాణ్ ను చూపిస్తూ వస్తున్నాడు.
తాజాగా నితిన్ నటించిన ‘చెక్’ సినిమా ప్రేక్షకలు ముందుకు వచ్చింది.ఈ సినిమా లో నితిన్ ఫొటో కాని ప్రస్థావన కాని ఎక్కడ లేదు.
దాంతో నితిన్ ఎందుకు ఈసారి పవన్ ఫొటో కాని ప్రస్థావన కాని లేదు అంటూ మెగా అభిమానులు సోషల్ మీడియా ద్వారా ప్రశ్నిస్తున్నారు.ఆ విషయమై నితిన్ స్పందిస్తూ ఇప్పటి వరకు చేసిన ప్రతి సినిమాలో కూడా పవన్ కళ్యాణ్ గారి ఫొటో ను ఏదో ఒక విధంగా చూపిస్తూ వచ్చాము.
కాని ఈ సినిమా విషయంలో మాత్రం అలా చేయాలనిపించలేదు.ఎందుకంటే ఈ సినిమా మెజార్టీ భాగం జైల్లో చిత్రీకరించాం.
కనుక ఏదో పెట్టాలి కదా అని ఇరికించే ప్రయత్నం చేయలేదు అంటూ నితిన్ క్లారిటీ ఇచ్చాడు.
పవన్ కళ్యాణ్ గారు నాకు లక్కీ ఛార్మ్ అని, ఆయన నా సినిమా ల ప్రమోషన్ లో పాల్గొన్నా లేదా ఆయన నా సినిమా ల్లో కనిపించినా కూడా తప్పకుండా విజయాన్ని సొంతం చేసుకుంటాను అంటూ చెప్పుకొచ్చాడు.
సోషల్ మీడియాలో వరుసగా పవన్ మరియు నితిన్ పోస్ట్ లు వస్తున్న నేపథ్యంలో అభిమానులు పెద్ద ఎత్తున షేర్ లు చేస్తూ ఉంటారు.కాని చెక్ విషయంలో అలా జరగక పోవడం వల్ల చర్చ జరిగింది.
ఆ చర్చకు నితిన్ ఫుల్ స్టాప్ పెట్టాడు.నితిన్ రంగ్ దే సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యాడు.
ఆ సినిమా షూటింగ్ సమయంలో పవన్ కళ్యాణ్ ను ఖచ్చితంగా వాడి ఉంటాడు అంటూ అభిమానులు నమ్మకం గా ఉన్నారు.రంగ్ దే సినిమా లో పవన్ లేకుంటే మాత్రం నితిన్ పై పవన్ ఫ్యాన్స్ ట్రోల్స్ మొదలు పెట్టే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.