ఎన్టీఆర్‌పై పడ్డ పవన్.. ఏది సెట్ చేస్తాడో..?  

Pawan Kalyan To Use NTR Title, Pawan Kalyan, NTR, Gajadonga, Bandipotu, Viroopaksha - Telugu Bandipotu, Gajadonga, Ntr, Pawan Kalyan, Viroopaksha

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తూ వకీల్ సాబ్ చిత్రాన్ని రెడీ చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాతో మరోసారి తన మార్క్‌ను క్రియేట్ చేసేందుకు పవన్ రెడీ అవుతున్నాడు.

 Pawan Kalyan Ntr Title

బాలీవుడ్‌లో సూపర్ హిట్ మూవీగా నిలిచిన ‘పింక్’ చిత్రాన్ని తెలుగులో ‘వకీల్ సాబ్’గా తెరకెక్కిస్తున్నాడు.ఇక ఈ సినిమా మెజారిటీ షూటింగ్ ఇప్పటికే పూర్తి చేసుకుని రిలీజ్‌కు రెడీగా ఉంది.

ఇక ఈ సినిమా తరువాత పవన్ తన నెక్ట్స్ మూవీని కూడా లైన్‌లో పెట్టే పనిలో పడ్డాడు.

ఎన్టీఆర్‌పై పడ్డ పవన్.. ఏది సెట్ చేస్తాడో..-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

ఇప్పటికే స్టార్ డైరెక్టర్ క్రిష్ డైరెక్షన్‌లో తన నెక్ట్స్ సినిమా ఉంటుందని అనౌన్స్ చేసిన పవన్, ఈ సినిమా షూటింగ్‌ను అతి త్వరలో ప్రారంభించేందుకు రెడీ అయ్యాడు.

కాగా ఈ సినిమాను పూర్తి పీరియాడికల్ సబ్జెక్ట్‌గా తెరకెక్కించేందుకు క్రిష్ పక్కా ప్రణాళిక రూపొందిస్తున్నాడు.ఇక ఈ సినిమాకు ‘విరూపాక్ష’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేయాలనే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉన్నట్లు గతకొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి.

కానీ ఇప్పుడు మరో రెండు టైటిళ్లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.రాబిన్‌హుడ్ తరహా పాత్రలో పవన్ నటిస్తుండటంతో ఈ సినిమాకు గజదొంగ, బందిపోటు అనే టైటిళ్లను పరిశీలిస్తున్నారు.

గతంలో ఎన్టీఆర్ నటించిన గజదొంగ, బందిపోటు చిత్రాలు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకోవడమే కాకుండా సూపర్ హిట్ చిత్రాలుగా నిలిచాయి.ఇప్పుడు ఆ టైటిళ్లతో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకోవాలని పవన్ చూస్తున్నాడు.

మరి పవన్ ఈ సినిమాకు ఏ టైటిల్‌ను ఫిక్స్ చేస్తాడా అనేది ఆసక్తికరంగా మారింది.ఇక ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫర్నాండెజ్ హీరోయిన్‌గా నటిస్తోందని తెలుస్తోంది.

తమిళ ప్రొడ్యూసర్ ఏఎం రత్నం ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నాడు.

#Pawan Kalyan #NTR #Gajadonga #Viroopaksha #Bandipotu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Pawan Kalyan Ntr Title Related Telugu News,Photos/Pics,Images..