లెఫ్ట్ పార్టీలకి దేబ్బెసిన..జనసేనుడు       2018-07-07   04:04:57  IST  Bhanu C

పవన్ కళ్యాణ్ జనసేన పెట్టిన తరువాత ప్రత్యక్ష రాజకీయల్లోకి వచ్చి నిత్యం అందుబాటులో ఉంటోంది కేవలం సంవత్సరం నుంచీ మాత్రమే..అయితే తన భవిష్యత్తు రాజకీయాలలో ఏ పార్టీ తో పొత్తు పెట్టుకుంటాడు అనే విషయాన్ని ఇప్పటికే వెల్లడించాడు వామపక్ష పార్టీలు తప్ప ప్రస్తుతానికి ఏ పార్టీ తో కూడా పవన్ పొత్తు లేనట్లే ఉంది అంతేకాదు గత కొంతకాలంగా వామపక్షాలు పవన్ తో రాసుకు పూసుకు తిరగడం కూడా జరిగింది ధర్నాలు,పాదయాత్రలు ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎన్నో కార్యక్రమాలు కలిసి మెలిసి చేశారు..అయితే
.

ఈ యవ్వారమే ఇప్పుడు వామపక్షాల కొంప ముంచింది..కేంద్రంలో ఎప్పుడు జట్టు కట్టే కాంగ్రెస్ తో కటీఫ్ అయ్యే దశకు చేరుకుంది…ప్రజారాజ్యం పెట్టి ఎంతో మంది నేతలని రోడ్డు పాలు చిరంజీవి చేస్తే వారి భవిష్యత్తుని ప్రశ్నార్ధకం చేస్తే పవన్ మాత్రం ఎంతో చరిత్ర కలిగిన వామపక్ష పార్టీల నే ఖంగుతినిపించాడు వాటి భవిష్యత్తు పై ఇప్పుడు నీలి నీడలు కమ్ముకుంటున్నాయని తెలుస్తోంది..

కేంద్రంలో ఎప్పటి నుంచో లెఫ్ట్ పార్టీలతో దోస్తీ చేస్తూ వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు లెప్ట్ పార్టీలను వదిలేయాలని భావిస్తోందట. అందుకు వివిధ కారణాలు ఉండగా అందులో జనసేనతో లెఫ్ట్ దోస్తానా కూడా ప్రధాన కారణంగా నిలిచింది…బీజేపీకి వ్యతిరేకంగా ‘మహాకూటమి’ ఏర్పాటులో బిజీగా ఉన్న కాంగ్రెస్ మిత్రపక్షాలైన సీపీఎం – సీపీఐతో పొత్తు విషయంలో దాదాపుగా స్పష్టమైన నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. వారిని కలుపుకొని వెళ్లరాదని నిర్ణయించినట్లు సమాచారం….దీనికి తగ్గట్లుగా శుక్రవారం పశ్చిమబెంగాల్ నేతలతో సమావేశమైన కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ పొత్తు విషయంలో నిర్ణయాన్ని 21కి వాయిదా వేశారు.

కాంగ్రెస్ నుంచి గెలిచిన 44 మంది ఎమ్మెల్యేల్లో 12 మంది ఇప్పటికే తృణమూల్ తీర్థం పుచ్చుకున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ – వామపక్షాలు కలిసి పోటీ చేసినప్పటికీ తృణమూల్ ను ఓడించలేకపోయాయి. దీంతో ఇప్పుడు ఆ రాష్ట్రంలో వామపక్షాలకు గుడ్ బాయ్ చెప్పాలని యోచిస్తోంది.. మరోవైపు ఏపీలో జనసేతో వామపక్షాలు కలిసి వెళ్లడాన్ని కూడా కాంగ్రెస్ జీర్ణించుకోలేకపోతోంది…అసలు వామపక్షాల ద్వంద్వ వైఖరిపై కారాలు మిరియాలు నూరుతోంది…దాంతో దేశవ్యాప్తంగా లెఫ్ట్ ని దూరం పెట్టాలని డిసైడ్ అయ్యారట.