పవన్ కళ్యాణ్ ఏమయ్యారు..అక్టోబర్ వచ్చేస్తోంది.   Pawan Kalyan Not Showing Interest In Politics     2017-10-20   01:02:34  IST  Bhanu C

పవన్ కళ్యాణ్..ఎప్పుడు ఏమి చేస్తాడో..ఏ విషయం ఎప్పుడు ప్రకటిస్తాడో తనకే తెలియదు..మాటల్లో ఉన్నంత క్లారిటీ చేతల్లో మాత్రం కనపడదు.ఒక పక్క రాజకీయాలు అంటూ సమస్యలమీద పోరాటం అని ప్రకటిస్తారు..ప్రకటించిన రోజు ఉండే హీట్..మళ్ళీ తరువాత కనపడదు..మరుసటి రోజు సినిమాలలో బిజీ అయిపోతారు.ప్రజలు పవన్ విషయం మర్చిపోయారు అనుకున్న టైం లో ఎదో ఒక సమస్యనో..లేక ఎవరో చేసే ఉద్యమాన్ని లెవనెత్తుకుని..వీరికి నా సంపూర్ణ మద్దతు ఉంటుంది ప్రభుత్వం వీరికి న్యాయం చేయాలి అనగానే..చంద్రబాబు స్పందించేయడం..సమస్యని పరిషరిస్తా అని ఓం ప్రదంగా కంటి తుడుపు చర్య చేపట్టడం..ఇలా బాబు గారి డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ జనసేన సినిమా నడుస్తోంది..

వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి.అక్టోబర్ లో పాదయాత్ర చేస్తా అని ప్రకటించిన విషయం తెలిసిందే.అయితే నేను కూడా పాదయాత్ర చేసేస్తా అది కూడా అక్టోబర్ లొనే అని మీడియా ముందు తెగ హడావిడి చేశాడు పవన్.ఇప్పుడు చుస్తే కనీసం పాదయాత్ర విషయంలో ఒక్క మాటకుడా మాట్లాడలేదు..మరి ఇన్నాళ్లూ పవన్ కళ్యాణ్ ఏం చేశాడు..జగన్ పాదయాత్ర చేసి సమయానికి పవన్ పాదయాత్ర చేయడం మొదలుపెట్టారు.

ఇది ఇలా ఉంటే.. జనసేన అధినేత ఇప్పుడు ఏం చేస్తున్నాడో ఎవరికీ తెలీదు. అక్టోబర్ నుంచి కొత్త రాజకీయ ప్రయాణం అని ప్రకటించిన ఆయన ఇప్పుడు ప్రజలకు కనపడటం లేదు.తన సినిమా పనులతో తెగ బిజీగా ఉన్నాడట..ఇప్పుడు మరింత ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. త్రివిక్రమ్ సినిమా పూర్తి కాగానే పవన్ కల్యాణ్ మరో సినిమాకు కమిట్ అవుతున్నాడట. దీని కోసం ప్రస్తుతం ప్రయత్నాలు సాగుతున్నాయని సమాచారం.మరి పీకే వేరొక సినిమాకి ఒకే చెప్పేస్తే పాదయాత్ర మాటేమిటి? అసలు పాదయాత్ర చేస్తాడా లేదా అనే సందేహాలు వస్తున్నాయి.పవన్ కళ్యాణ్ పాదయాత్ర చేస్తాడా లేక మరో సినిమాలో నాటిస్తాడా అని జనసేన కార్యకర్తలని అడుగుతుంటే మాకేం తెలుసు అన్నట్లుగా తెల్ల మొఖాలు వేసుకుని చూస్తున్నారట.