'పశ్చిమ'నుంచి పవన్ పోటి లేనట్లేనా..?   Pawan Kalyan Not Participating From West Godavari For Election In 2019     2018-11-07   11:06:10  IST  Surya

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పశ్చిమ గోదావరి ప్రజలని నిరాస పరిచారు. పవన్ కళ్యాణ్ తన సొంత జిల్లా నుంచీ పోటీ చేస్తారని ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న అభిమానులకి నిన్నటి రోజున పిఠాపురంలో జరిగిన పోరాట యాత్రలో పెద్ద బాంబు పేల్చారు. దాంతో ఒక్క సారిగా ఇప్పుడు పశ్చిమ జనసేన పార్టీ కార్యకర్తలు, పవన్ అభిమానులు అందోళన చెందుతున్నారు.

ఇంతకీ పవన్ ఏమన్నారు..పశ్చిమ నుంచీ పోటీ చేయలేక పోవడానికి గల కారణం ఏమిటి అనే వివరాలలోకి వెళ్తే..

ప్రజా పోరాట యాత్ర తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలో నిన్నటి రోజున అశేష ప్రజానీకం మధ్య జరిగింది. అయితే అక్కడ సభావేదికపై నుంచీ పవన్ కళ్యాణ్ ఎప్పటిలాగానే తెలుగుదేశం పార్టీని విమర్శలు చేస్తూ అభిమానులు , నేతల్లో జోష్ ని కలిగించారు. ఏపీలో జవాబుదారితనం లేని పరిస్థితుల్లో జనసేన పార్టీ ఆవిర్భావం జరిగిందని ఎంతో బలమైన భావజాలంతో జనసేన పార్టీ రూపుదిద్దుకుందని పవన్ స్పష్టం చేశారు..అంతేకాదు పవన్ కళ్యాణ్ తానూ పోటీ చేసే స్థానం పై అదే వేదిక సాక్షిగా ఓ క్లారిటీ కూడా ఇచ్చారు.

Pawan Kalyan Not Participating From West Godavari For Election In 2019-

పిఠాపురంలో నుంచీ పోటీ చేయాలనీ అడుగుతున్నారని ఈ ఊరి దేవుడు శ్రీపాద వల్లభుడి ఆశీస్సులు ఉంటే తప్పకుండా చేస్తానని తెలిపారు..అంతేకాదు తిరుపతి, అనంతపురం, ఇచ్చాపురం ప్రాంతాల నుంచి కూడా తనను పోటీ చేయాలని అడుగుతున్నారని కానీ నేను ఏమి చేయలన్నా సరే జనసేన సెలక్షన్ కమిటీ అన్ని అంశాలను బేరీజు వేసి చెప్తుందని పవన్ కళ్యాణ్ తెలిపారు…అయితే ఈ ప్రకటనతో పవన్ తూగో జిల్లా ,అనంతపురం,శ్రీకాకుళ జిల్లాలపైనే పోటీ చేసే దృష్టి పెట్టారని పశ్చిమలో పవన్ పోటీ చేసే అవకాశం లేదని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు విశ్లేషకులు.