మోదీ టీమ్ లో పవన్ లేడా..? బాబు టీమ్ లోకి వస్తాడా ...?

ఏపీలో ప్రస్తుత రాజకీయ పరిణామాలన్నీ గందరగోళంగానే కనిపిస్తున్నాయి.ఎన్నికల సమయం ఒకవైపు జెట్ స్పీడ్ తో దూసుకువస్తుండడంతో…ఆ స్పీడ్ అందుకునేందుకు అన్ని రాజకీయ పార్టీలు కసరత్తు చేస్తున్నాయి.

 Pawan Kalyan Not In Modis Cout He Will Tie Up With Chandrababu-TeluguStop.com

వచ్చే ఎన్నికల్లో ఆరు నూరైనా అధికారం మాకే దక్కాలి అనుకుంటూ … ఎత్తులు పై ఎత్తులతో ప్రత్యర్థులను ముప్పుతిప్పలు పెట్టాలని చూస్తున్నాయి.ఈ నేపథ్యంలో అనేక కీలక పరిణామాలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చోటుచేసుకుంటున్నాయి.

ఇక తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పెట్టిన ప్రెస్ మీట్ కూడా ఇదే స్పష్టం చేస్తోంది.ఇప్పటివరకు జనసేనను రాజకీయ ప్రత్యర్థిగానే చుసిన టీడీపీ మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో జనసేనను దగ్గర చేసుకోవాలని చూస్తున్నట్టుగా కనిపిస్తోంది.

అందుకే….గతంలో ఆరోపించినట్టుగా… పవన్ -జగన్ మోదీ తీరం లో ఉన్నారని… వీరంతా కలిసి నన్ను రాజకీయంగా అణగదొక్కడానికి చూస్తున్నారని బాబు ప్రచారం చేసుకుంటూ వచ్చాడు.అయితే ఇప్పుడు ఆ సంగతి పక్కనపెట్టి జనసేనతో టీడీపీ కలిస్తే జగన్ కి వచ్చిన నొప్పి ఏంటి అనేవరకు బాబు వచ్చేసాడు.అందుకే బాబు ఇప్పుడు పవన్ మీద విమర్శలు పూర్తిగా మానేసి వైసీపీ… బీజేపీ… టీఆర్ఎస్ పార్టీల మీద పెట్టాడు.

t కేసీఆర్, జగన్, మోడీ కలిసి.ఏపీలో రాజకీయం చేస్తున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు.అలాగే…పదో శ్వేతపత్రం విడుదల చేసిన తర్వాత జర్నలిస్టులు అడిగిన అనేక ప్రశ్నలకు చంద్రబాబు సమాధానాలిచ్చారు.ఆ సమయంలో జనసేన, టీడీపీ కలుస్తాయని.

బయట ప్రచారం జరుగుతోందని.ఓ విలేకరి ప్రశ్నకు.

ఊహాజనిత ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేనని చంద్రబాబు చెప్పారు.

అదే సమయంలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.పవన్ కల్యాణ్.తనను అదే పనిగా ప్రతీ చోటా విమర్శిస్తున్నారని గుర్తు చేశారు.

జగన్మోహన్ రెడ్డి మాత్రం.చాలా కాలం పాటు పవన్ కల్యాణ్ పై విమర్శలు చేయలేదని.

మళ్లీ ఇటీవలి కాలం నుంచే విమర్శలు గుప్పిస్తున్నారని గుర్తు చేశారు.టీడీపీకి, జనసేనకు లింక్ పెట్టి ఆయన శ్రీకాకుళంలో విమర్శలు చేస్తున్న విషయాన్ని జర్నలిస్టులు ప్రస్తావించినప్పుడు.

ఆయనకు నొప్పేంటని ప్రశ్నించారు.జనేసన పోటీ చేస్తానంటే.

జగన్ ఎందుకు భయటపడుతున్నారన్నారు అంటూ మాట్లాడారు.అయితే బాబు ఈ మాటలను బట్టి చూస్తే మళ్ళీ జనసేన పార్టీతో కలిసి ఎన్నికల సంగ్రామంలోకి వెళ్ళాలి అన్నట్టుగానే కనిపిస్తోంది.కానీ… ఈ విషయంలో పవన్ వైకిరి ఎలా ఉంది అనేది మాత్రం ఇంకా క్లారిటీ లేదు.చంద్రబాబు మాటలు చూస్తుంటే… జనసేన – టీడీపీ పొత్తు పొత్తుకునే అవకాశం ఉందా అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి.

ఏమో రాజకీయాలు కదా ఏమైనా జరగొచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube