పాపం హరీష్ శంకర్‌కి ఎందుకు ఇలా జరుగుతుంది? పవన్ ద్రోహం చేశాడు!

హరీష్ శంకర్‌ దర్శకత్వంలో గద్దలకొండ గణేష్ సినిమా 2019 సంవత్సరంలో వచ్చిన విషయం తెల్సిందే.అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా దర్శకుడు హరీష్ శంకర్‌ తన తదుపరి సినిమాను పవన్‌ కళ్యాణ్‌ తో చేసేందుకు వెయిట్‌ చేస్తున్నాడు.

 Pawan Kalyan Not Giving Chance To Director Harish Shankar  , Pawan Kalyan ,  Har-TeluguStop.com

ఆ మధ్య భవదీయుడు భగత్‌ సింగ్ టైటిల్ తో ఒక సినిమాను చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించిన విషయం తెల్సిందే.దాదాపు రెండేళ్ల తర్వాత ఆ సినిమా కాదు మరో సినిమా ను పవన్‌ కళ్యాణ్ తో చేయబోతున్నట్లుగా ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ అనే టైటిల్ తో సినిమా ను ప్రకటించిన విషయం తెల్సిందే.

పవన్ కళ్యాణ్‌ హీరోగా ఉస్తాద్‌ భగత్‌ సింగ్ సినిమాను చేసేందుకు స్క్రిప్ట్‌ మొత్తం రెడీ చేసుకుని పెట్టిన హరీష్ శంకర్‌ కు పవన్ కళ్యాణ్ నుండి పిలుపు రావడం లేదు.ఆ సినిమా కు డేట్లు ఎప్పుడు ఇస్తాడో తెలియడం లేదు.

ఇప్పటికే మూడు నాలుగు సంవత్సరాల సమయం ను వృదా చేసుకున్న దర్శకుడు హరీష్ శంకర్ ఇప్పటికి అయినా పవన్‌ తో సినిమా మొదలు పెట్టాలి అని అభిమానులు కోరుకుంటున్నారు.కానీ ఆయన మాత్రం ఇప్పటి వరకు తదుపరి సినిమాను పవన్ తో మొదలు పెట్టలేదు.

Telugu Harihara, Harish Shankar, Nidhhi Agerwal, Pawan Kalyan, Saaho Sujeeth, Te

మరో వైపు పవన్‌ కళ్యాణ్‌ నిన్నకాక మొన్న ప్రకటించిన సాహో సుజీత్‌ సినిమా యొక్క పూజా కార్యక్రమాలు నేడు చేస్తున్నాడు.రెగ్యులర్‌ షూటింగ్‌ కూడా వెంటనే ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు.హరి హర వీరమల్లు సినిమా సమయంలో ప్రారంభం అవ్వాల్సి ఉన్న హరీష్ శంకర్ మరియు పవన్‌ మూవీ ఇప్పటి వరకు కూడా పట్టాలెక్కడం లేదు.

Telugu Harihara, Harish Shankar, Nidhhi Agerwal, Pawan Kalyan, Saaho Sujeeth, Te

పాపం హరీష్ శంకర్ ను మరీ ఎక్కువగా వెయిటింగ్‌ చేయిస్తున్నాడు అనే విమర్శలు వస్తున్నాయి.పవన్‌ ఈ విషయంలో దర్శకుడు హరీష్ శంకర్ కు ద్రోహం చేస్తున్నాడు అంటూ అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.హరీష్ శంకర్ మాత్రం పవన్ తో సినిమాను త్వరలో ప్రారంభించి వచ్చే ఏడాది సంక్రాంతి వరకు విడుదల చేస్తాం అన్నట్లుగా చెబుతున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube