పవన్ అంటే పడి చస్తానంటోన్న బ్యూటీ  

Niddhi Agerwal Favourite Actor Pawan Kalyan, Niddhi Agerwal, Ismart Shankar, Pawan Kalyan, Tollywood News - Telugu Ismart Shankar, Niddhi Agerwal, Pawan Kalyan, Tollywood News

టాలీవుడ్‌లో సవ్యసాచి చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ నిధి అగర్వాల్, ఆ సినిమాతో మంచి ఇంప్రెషన్ దక్కించుకుంది.ఇక ఆ సినిమా తరువాత అక్కినేని అఖిల్‌తో కలిసి మిస్టర్ మజ్ను చిత్రంలో నటించి మెప్పించింది.

 Pawan Kalyan Niddhi Agerwal Ismart Shankar

కానీ ఈ రెండు సినిమాలు కూడా ఆమెకు కమర్షియల్ సక్సెస్‌ను ఇవ్వలేకపోయాయి.దీంతో ఆమె కెరీర్ ఎలా సాగుతుందా అని అనుకుంటున్న సమయంలో యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని నటించిన ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రంలో నటించి అదిరిపోయే సక్సెస్ అందుకుంది ఈ బ్యూటీ.

టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో ఈ సినిమా రావడంతో మాస్ ప్రేక్షకులకు అదిరిపోయే ట్రీట్ ఇచ్చింది ఈ సినిమా.ఇక రామ్ యాక్టింగ్‌కు నభా నటేష్, నిధి అగర్వాల్‌ల అందాల ఆరబోత తోడవడంతో ఈ సినిమా బ్లాక్‌బస్టర్ హట్‌గా నిలిచింది.

పవన్ అంటే పడి చస్తానంటోన్న బ్యూటీ-Gossips-Telugu Tollywood Photo Image

నిధి అగర్వాల్‌కు ఈ సినిమాతో అదిరిపోయే బ్రేక్ దక్కిందని చెప్పాలి.ఈ సినిమాతో అమ్మడు తన కెరీర్‌ను సెట్ చేసుకునేందుకు ప్లాన్ చేస్తోంది.కానీ అనుకున్న స్థాయిలో మాత్రం ఆఫర్లు రాకపోవడంతో నిధి అగర్వాల్ డైలమాలో పడింది.

అయితే తనకు టాలీవుడ్‌లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టమని ఆమె అంటోంది.

టాలీవుడ్‌కు బాలీవుడ్‌కు చాలా తేడా ఉందని నిధి అంటోంది.షూటింగ్ సెట్స్‌లో ఇచ్చే టిఫిన్స్ దగ్గర్నుండి సినిమా రిలీజ్‌ల వరకు ఇక్కడ అన్నీ ప్రత్యేకంగా ఉంటాయని ఆమె అంటోంది.

అందుకే తనకు టాలీవుడ్ అంటే ఎక్కువ ఇష్టమని, పవన్ కళ్యాణ్ అంటే మరీ ఇష్టమని ఆమె అంటోంది.అయితే ప్రస్తుతం అవకాశాలు అంతంతమాత్రంగా ఉండటంతోనే నిధి ఇలాంటి కామెంట్ చేసిందని, పవన్ సినిమాలో నటించే ఛాన్స్ వస్తే ఖచ్చితంగా చేస్తానని ఆమె చెప్పడమే ఆమె ఆంతర్యం అని పలువురు కామెంట్ చేస్తున్నారు.

#Ismart Shankar #Pawan Kalyan #Niddhi Agerwal

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Pawan Kalyan Niddhi Agerwal Ismart Shankar Related Telugu News,Photos/Pics,Images..