అన్నింటి కంటే ముందే పవన్‌ ఆ సినిమాను చేయబోతున్నాడా?  

pawan kalyan next film with sagar Pawan Kalayan, Vakeel Sahebh, Krish, Ayyapanum Koshiyum, Sagar Direction, Rana, Sitara Entertainemnts, - Telugu Pawan Kalyan, Pawan Movie News, Telugu Film News, Telugu News, Tollywood News, Vakeel Saab

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ మరి కొన్ని రోజుల్లో వకీల్‌ సాబ్‌ సినిమా షూటింగ్‌లో జాయిన్‌ కాబోతున్నాడు.ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్‌ ఏర్పాట్లు జరుగుతున్నాయి.

TeluguStop.com - Pawan Kalyan Next Film With Sagar

రెండు లేదా మూడు వారాల పాటు ఈ సినిమా షూటింగ్‌లో పవన్‌ పాల్గొంటాడు అంటూ వార్తలు వస్తున్నాయి.ఆ తర్వాత పవన్‌ కళ్యాణ్‌ క్రిష్‌ దర్శకత్వంలో ఒక సినిమాను చేయాల్సి ఉంది.

ఇప్పటికే ఆ సినిమాకు విరూపాక్ష అనే టైటిల్‌ను కూడా అనుకున్నారు.క్రిష్‌ దర్శకత్వంలో సినిమాకు సంబంధించి పవన్‌ లేకుండా కొన్ని రోజుల చిత్రీకరణ కూడా జరిగింది.

TeluguStop.com - అన్నింటి కంటే ముందే పవన్‌ ఆ సినిమాను చేయబోతున్నాడా-Gossips-Telugu Tollywood Photo Image

ఇలాంటి సమయంలో సినిమాకు సంబంధించిన వార్త సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం క్రిష్‌ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా కంటే ముందుగానే మలయాళ మూవీ అయ్యప్పన్‌ కోషియుమ్‌ సినిమాను రీమేక్‌ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది.

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ వారు ఇటీవలే ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు.సినిమా కథ చాలా సింపుల్‌గా ఉండటంతో పాటు మల్టీస్టారర్‌ మూవీ అవ్వడం వల్ల కేవలం నెల రోజుల వ్యవదిలోనే ఈ సినిమాను తీసేయాలని భావిస్తున్నారట.

సాగర్‌ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందబోతుంది.తక్కువ రోజుల్లో ఈ సినిమా పూర్తి అయ్యే అవకాశం ఉంది కనుక పవన్‌ మొదట ఈ రీమేక్‌ ను మొదలు పెట్టాలని భావిస్తున్నాడట.

అతి త్వరలోనే సినిమాను మొదలు పెట్టి సినిమాను సమ్మర్‌ వరకు విడుదల చేయాలని భావిస్తున్నారు.ఈ సినిమాలో పవన్‌ తో పాటు రానా కూడా నటించే అవకాశం ఉందని అంటున్నారు.

వకీల్‌ సాబ్‌ పూర్తి అయిన వారం రోజులకే ఈ రీమేక్‌ ను పట్టాలెక్కించే అవకాశం ఉంది.వకీల్‌ సాబ్‌ మరియు ఈ రీమేక్‌ కేవలం నెల రోజుల గ్యాప్‌ లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది అంటున్నారు.

#Pawan Kalyan #Vakeel Saab

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Pawan Kalyan Next Film With Sagar Related Telugu News,Photos/Pics,Images..