Pawan kalyan harihara veeramallu పవర్ ఫుల్ లుక్ లో అదరగొడుతున్న పవన్ కళ్యాణ్.. ఫొటోస్ వైరల్?

టాలీవుడ్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.అయితే మొన్నటి వరకు రాజకీయాలలో ఫుల్ బిజీబిజీగా గడిపిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాల పైన దృష్టిని పెట్టాడు.

 Pawan Kalyan New Look Leaked From Harihara Veeramallu Movie Its Goosebumps For F-TeluguStop.com

ఈ నేపథ్యంలోనే ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వస్తున్న హరిహర వీరమల్లు సినిమాలో యధావిధిగా షూటింగ్లో పాల్గొంటున్నారు.ప్రస్తుతం హరిహర వీరమల్లు సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో జరుగుతోంది.

అయితే పవన్ కళ్యాణ్ ఈసారి మళ్లీ గ్యాప్ ఇవ్వకుండా వరుసగా షెడ్యూల్ ని ప్లాన్ చేశారట.

ఈ సినిమా పూర్తి అయ్యేవరకు పక్కకు వెళ్లకుండా ఉండే విధంగా ప్లాన్ చేసుకున్నారట పవన్.ఇది ఇలా ఉంటే ఇటీవలే పవన్ కళ్యాణ్ షూటింగ్ సెట్లో భాగంగా బైక్ లో చెక్కర్లు కొడుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే.

తాజాగా మరొకసారి పవన్ కు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.ఆ ఫోటోలలో హరిహర వీరమల్లు సినిమా గెటప్ లో కనిపించారు పవన్ కళ్యాణ్.అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఆ ఫోటోలలో రెడ్ కలర్ డ్రెస్ లో గడ్డంతో ఫుల్ పవర్ ఫుల్ లుక్ లో కనిపిస్తున్నారు.యుద్ధంలో పోరాడడానికి తయారైన ఒక యోధుడిలా కనిపిస్తున్నాడు పవన్.కాగా పవన్ కళ్యాణ్ గెటప్ ఆధ్యంతం ఆకట్టుకుంటోంది.

అభిమానులకు ఆ ఫోటోలు పూనకాలు తెప్పిస్తున్నాయి.కాగా హరిహర వీరమల్లుకు సంబంధించిన ఒక్కొక్క అప్డేట్ విడుదల అవుతుండడంతో ఆ సినిమాపై అంచనాలు మరింత పెరుగుతున్నాయి.

హరిహర వీరమల్లు సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా పలు కారణాలవల్ల వాయిదా పడుతూ వచ్చింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube