వీరమల్లు కోసం సరికొత్త అవతారంలో పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ వకీల్ సాబ్ ఇప్పటికే షూటింగ్ ముగించుకుని రిలీజ్‌కు రెడీగా ఉంది.ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటేందుకు పవన్ రెడీ అవుతున్నాడు.

 Pawan Kalyan New Look In Veeramallu, Pawan Kalyan, Krish, Veeramallu, Viroopaksh-TeluguStop.com

దాదాపు రెండేళ్ల తరువాత పవన్ బిగ్‌స్క్రీన్‌పై కనిపించనుండటంతో వకీల్ సాబ్ చిత్రాన్ని ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రక్షకులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు.కాగా ఈ సినిమాను దర్శకుడు వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తుండటంతో వకీల్ సాబ్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అనే ఆసక్తి అందరిలో నెలకొంది.

ఇక ఈ సినిమా రిలీజ్ కాకముందే పవన్ వరుసబెట్టి సినిమాలు చేస్తూ దూకుడు చూపిస్తున్నాడు.

ఈ క్రమంలో దర్శకుడు క్రిష్ డైరెక్షన్‌లో పవన్ తన నెక్ట్స్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాను పూర్తిగా పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు చిత్ర యూనిట్.కాగా ఈ సినిమాలో పవన్ పాత్ర చాలా వైవిధ్యంగా ఉండబోతున్నట్లు చిత్ర యూనిట్ మొదట్నుండీ చెబుతూ వస్తోంది.

ఇక ఈ సినిమాలో పవన్ రాబిన్‌హుడ్ తరహా పాత్రలో నటిస్తుండటంతో, ఆయన లుక్ చాలా కొత్తగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.ఈ సినిమాలో పవన్ సరికొత్త లుక్‌ను ఇప్పట్లో రివీల్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ లేరట.

దీంతో పవన్ ఈ సినిమాలో ఎలా ఉండబోతున్నాడా అనే అంశం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.అయితే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్ రిలీజ్ చేసినా, అందులో పవన్ మొహాన్ని మాత్రం రివీల్ చేయబోరట.

పవన్ మొహాన్ని కవర్ చేస్తూ ఈ ఫస్ట్ లుక్‌ను రివీల్ చేసేలా క్రిష్ అండ్ టీమ్ ప్లాన్ చేస్తున్నారు.కాగా ఈ సినిమాకు విరూపాక్ష, వీరమల్లు అనే టైటిల్స్‌ను చిత్ర యూనిట్ పరిశీలిస్తున్నారట.

ఈ సినిమాలో పవన్ సరసన హీరోయిన్‌గా బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫర్నాండెజ్, అందాల భామ నిధి అగర్వాల్‌లు కలిసి నటిస్తున్నట్లు తెలుస్తోంది.ఈ సినిమాను తమిళ నిర్మాత ఏఎం రత్నం ప్రొడ్యూస్ చేస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీ వర్గాల్లో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube