ప్రొడ్యూసర్లకు, డైరెక్టర్లకు కొత్త కండీషన్స్ పెట్టిన పవన్ కళ్యాణ్.. ఇక కష్టమేనా?

టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు.ఈ క్రమంలోనే భీమ్లా నాయక్, హరిహర వీరమల్లు లాంటి సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నాడు.

 Pawan Kalyan New Conditions To Makers, Pawan Kalyan, Bheemla Nayak, Hari Hara Veeramallu, New Conditions-TeluguStop.com

ఇక భీమ్లా నాయక్ సినిమాకు సంబంధించిన షూటింగ్ శర వేగంగా జరుగుతోంది.ఈ సినిమాను అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్రబృందం ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ చివరి దశలో ఉంది.క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న మరొక చిత్రం హరిహర వీరమల్లు.

 Pawan Kalyan New Conditions To Makers, Pawan Kalyan, Bheemla Nayak, Hari Hara Veeramallu, New Conditions-ప్రొడ్యూసర్లకు, డైరెక్టర్లకు కొత్త కండీషన్స్ పెట్టిన పవన్ కళ్యాణ్.. ఇక కష్టమేనా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ సినిమాకు సంబంధించి బ్యాలెన్స్ సన్నివేశాలను ఫిబ్రవరిలో ప్రారంభించబోతున్నారు.

ఇక ఈ సినిమాలు పూర్తయిన తర్వాత పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ దర్శకత్వంలో భవదీయుడు భగత్ సింగ్, సురేందర్ రెడ్డి సినిమాలు చేయబోతున్నాడు.

ఇవే కాకుండా ఇంకా పలు సినిమాలు కూడా లైన్ లో ఉన్నాయి అని సమాచారం.ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ సినిమాల విషయంలో దర్శకనిర్మాతలకు కొన్ని కొత్త షరతులు విధించారు అని సమాచారం.

దర్శకుడు హరీష్ శంకర్ కూడా భగవదీయుడు భగత్ సింగ్ ఈ సినిమాను కూడా రెండు నెలల్లో పూర్తి చేయబోతున్నట్లు సమాచారం.అదేవిధంగా దర్శకుడు సురేందర్ రెడ్డి ప్రస్తుతం అఖిల్ తో ఏజెంట్ సినిమా ను చిత్రీకరిస్తున్నాడు.

ఈ సినిమా అనంతరం పవన్ కళ్యాణ్ తో సినిమా రెండు నెలల్లో పూర్తి చేయనున్నాడు.

Telugu Bheemla Nayak, Harihara, Pawan Kalyan-Movie

అయితే ఆ రెండు సినిమాలకు సంబంధించిన షూటింగ్ ఈ సంవత్సరంలో పూర్తి చేయాలని పవన్ కళ్యాణ్ పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది.2023 నుంచి పవన్ కళ్యాణ్ పూర్తిగా రాజకీయాలకే పరిమితం అవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.ఇక 2024లో జరగబోయే ఎన్నికల కోసం పవన్ కళ్యాణ్ ఇప్పటి నుంచి పక్కా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు.

ఇకపోతే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమాల వల్ల రాజకీయాల్లో పూర్తి స్థాయిలో యాక్టివ్ గా ఉండలేకపోతున్నారు.అందువల్లే దర్శకనిర్మాతలకు ఇలాంటి షరతులు విధించినట్టు తెలుస్తోంది.

భీమ్లా నాయక్, హరిహర వీరమల్లు సినిమాలు ఈ ఏడాది విడుదల అయితే 2023 లో మిగిలిన రెండు సినిమాలు విడుదల అయ్యేలా పవర్ స్టార్ ప్లాన్ చేస్తున్నారు.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనుకుంటున్న విధంగా ఆ ప్లాన్ లు సక్సెస్ అవుతాయో లేదో చూడాలి మరి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube