డీల్ ఓకేనా : పవన్ తో బీజేపీ రాజకీయం మొదలయ్యిందంటగా ?  

Pawan Kalyan Deal With Bjp Party Over Amaravathi-janasena,narendra Modi,pawan Kalyan,ysrcp,పవన్ తో బీజేపీ

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అకస్మాత్తుగా ఢీల్లీ టూర్ కి వెళ్లడంపై రకరకాల వార్తలు హల్చల్ చేస్తున్నాయి.అమరావతి విషయంలో రెండు రోజుల క్రితం పవన్ బీజేపీ ని, ఆ పార్టీ అగ్ర నాయకులను ఉద్దేశించి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

Pawan Kalyan Deal With Bjp Party Over Amaravathi-janasena,narendra Modi,pawan Kalyan,ysrcp,పవన్ తో బీజేపీ Telugu Political Breaking News - Andhra Pradesh,Telangana Partys Coverage-Pawan Kalyan Deal With BJP Party Over Amaravathi-Janasena Narendra Modi Pawan Ysrcp పవన్ తో బీజేపీ

రాజధాని వ్యవహారం ఈ స్థాయిలో ఉదృతం అవ్వడం వెనుక బీజేపీ మెతక వైకిరే కారణమని, ఆ పార్టీ నాయకులు ఇక్కడో మాట అక్కడో మాట చెబుతూ రాజధాని వ్యవహారం పై ఏ క్లారిటీ లేకుండా ఉన్నారని పవన్ ఆగ్రహం వ్యక్తం చేసారు.బీజేపీ ఒక్క మాట చెబితే చాలు జగన్ మూడు రాజధానుల విషయాన్ని పక్కనపెట్టేస్తారని, కానీ బీజేపీ అలా చేయడంలేదు అంటూ బీజేపీ పై ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన రెండో రోజే ఆయనకు బీజేపీయే అగ్ర నాయకుల నుంచి పిలుపు రావడం అనేక అనుమానాలు రేకెత్తించింది.

పవన్ వ్యాఖ్యలపై ఆగ్రహం చెందిన బీజేపీ అధిష్టానం ఆయనకు గట్టిగా క్లాస్ పీకేందుకే ఆయనను ఢిల్లీకి పిలిచినట్టుగా ప్రచారం మొదలయ్యింది.

కానీ ఏపీలో బలపడాలని చూస్తున్న బీజేపీ పవన్ చరిష్మాను పూర్తి స్థాయిలో ఉపయోగించుకుని రాజకీయంగా బలపడాలని చూస్తోంది.

ఇప్పటికే జనసేనను తమ పార్టీ లో విలీనం చేయాల్సిందిగా ప్రతిపాదన పెట్టగా దానికి పవన్ నిరాకరించాడు.అంతే కాదు ఎట్టి పరిస్థితుల్లోనూ విలీనం చేయనని, సొంతంగానే పార్టీని ముందుకు తీసుకెళ్తానని ప్రకటించాడు.

అయితే పవన్ కు రాజకీయం సరిగ్గా అర్ధం కాకపోవడంతోనే ఇలా వెనకబడిపోతున్నాడని, కానీ పవన్ కు జనాల్లో మంచి క్రేజ్ ఉందని బీజేపీ అధిష్టానం గుర్తించింది.దీంతో పవన్ ను ముందర పెట్టి ఏపీలో వైసీపీ హవా తగ్గించి తాము రాజకీయంగా బలమైన శక్తిగా ఏపీలో ఎదగాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది.

పవన్ కూడా తాను ఏపీలో ఒంటరిగా పోటీ చేసి గెలవడం అసాధ్యం అనే ఒక బలమైన నిర్ణయానికి వచ్చేయడంతో బీజేపీ అండదండలు కోరుకుంటున్నాడు.గత ఎన్నికల్లో జనసేన విడిగా పోటీ చేసి నష్టపోయిందనే విషయాన్ని పవన్ కల్యాణ్ ఇంకా పూర్తిగా జీర్ణించుకోలేకపోతున్నారు.

టీడీపీ,బీజేపీ, జనసేన కలిసి పోటీ చేసి ఉంటే వైసీపీ గెలిచి ఉండేది కాదనే బలమైన భావనను పవన్ కల్యాణ్ అనేక సందర్భాల్లో వ్యక్తం చేస్తున్నారు.ఇక అమరావతి విషయంలో బీజేపీ రాష్ట్ర శాఖ రెండు రకాలైన అభిప్రాయాలతో ఉంది.

ఇప్పటివరకు ఆ గందరగోళం పోలేదు.తాజాగా జరిగిన కోర్ కమిటీ సమావేశంలో ఏకాభిప్రాయానికి వచ్చారు.

అమరావతి కొనసాగింపునే బీజేపీ ఫైనల్ గా కోరుకుంటోంది.పవన్ కల్యాణ్, చంద్రబాబుల కోరిక కూడా అదే.

ఇప్పుడు పవన్ ఢిల్లీ టూర్ లో బీజేపీ ఇచ్చే ఆఫర్ పవన్ కు ఒకే అయితే రానున్న రోజుల్లో ఆ పార్టీ తో కలిసి ముందుకు వెళ్లడమో లేక జనసేనను బీజేపీలో కలపడమో జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఇది రాజకీయం కదా ఏదైనా జరగవచ్చు.

తాజా వార్తలు

Pawan Kalyan Deal With Bjp Party Over Amaravathi-janasena,narendra Modi,pawan Kalyan,ysrcp,పవన్ తో బీజేపీ Related....