పవన్ ను చిక్కుల్లో పెట్టేసిన నాగబాబు ?  

Pawan Kalyan Nagababu Balakrishna Issue - Telugu Balakrishna, Chiranjeevi, Elections, Janasena, Nagababu, Pawan Kalyan

ఏపీ రాజకీయాల్లో చక్రం తిప్పాలనే ఆశతో జనసేన స్థాపించి రాజకీయంగా బలం పెంచుకునేందుకు రకరకాలుగా ప్రయత్నిస్తున్నారు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్.2019 ఎన్నికలకు ముందు వరకు పవన్ టిడిపి తో అనేక కార్యక్రమాల్లో పాల్గొంటూ, సన్నిహితంగా మెలుగుతూ వచ్చారు.ఎన్నికలకు ముందు జనసేన టీడీపీ పొత్తు పెట్టుకుంటాయి అని అందరూ అంచనా వేశారు.కానీ ఆ అంచనాలను తలకిందులు చేస్తూ పవన్ ఒంటరిగా ఎన్నికల బరిలోకి దిగారు.

 Pawan Kalyan Nagababu Balakrishna Issue

కానీ ఎన్నికల ఫలితాలు పవన్ ను తీవ్ర నిరాశ, నిస్పృహల్లోకి నెట్టేశాయి.అయినా 2024 ఎన్నికల నాటికి జనసేనను రాజకీయంగా మరింత బలోపేతం చేయాలని పవన్ కంకణం కట్టుకుని ఆ విధంగా ముందుకు వెళ్తున్నారు.ప్రజా పోరాటాలు, ఉద్యమాలు చేస్తూనే రాజకీయ వ్యూహాలు రూపొందించుకుంటున్నారు.

2024 ఎన్నికల్లో విజయం సాధించాలంటే అతనొక్కడి బలం సరిపోదు అని గ్రహించిన ఆయన బీజేపీతో పొత్తు పెట్టుకుని ముందుకు వెళ్తున్నారు.అలాగే టిడిపి తోనూ సన్నిహితంగా ఉంటూ వస్తున్నారు.అవసరమైతే వచ్చే ఎన్నికల నాటికి టిడిపితో పొత్తు పెట్టుకుని ముందుకు వెళ్లే అవకాశం ఉంటుందని అంచనాలో పవన్ ఉంటూ, ఇప్పటికీ టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తూ వస్తున్నారు.

పవన్ ను చిక్కుల్లో పెట్టేసిన నాగబాబు -Political-Telugu Tollywood Photo Image

ఇది ఇలా ఉంటే పవన్ సోదరుడు, జనసేన నాయకుడు నాగబాబు వ్యవహారం పవన్ కు అసలు నచ్చడం లేదట.ఈ మధ్యకాలంలో ఆయన తరచుగా వివాదాస్పద అంశాల జోలికి వెళ్తూ, వార్తల్లో వ్యక్తిగా ఉంటున్నారు.

కొద్ది రోజుల క్రితం మహాత్మా గాంధీని చంపిన గాడ్సే నిజమైన దేశభక్తుడు అంటూ నాగబాబు ప్రశంసించి కలకలం రేపారు.

ఇక కొద్ది రోజుల క్రితం సినిమా ఇండస్ట్రీ కి సంబంధించిన వివాదంలో బాలయ్య చిరు మధ్య పరోక్షంగా వార్ మొదలైంది.ఈ వ్యవహారంలోనూ, బాలయ్య ను టార్గెట్ చేసుకుని విమర్శలు చేసే క్రమంలో నాగబాబు టిడిపి పైన విమర్శలకు దిగారు.గత ప్రభుత్వంలో అమరావతి భూముల వ్యవహారంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఇన్సైడర్ ట్రేడింగ్ కు పాల్పడ్డారని ఆరోపణలు చేశారు.

ఎంతో నమ్మకంతో 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ప్రజలు గెలిపిస్తే ఏపీని సర్వనాశనం చేశారని నాగబాబు విమర్శించారు.రైతుల దగ్గర చౌకగా భూములు తీసుకుని రియల్ ఎస్టేట్ చేశారనే విధంగా నాగబాబు కామెంట్స్ చేశారు.

ఈ వ్యాఖ్యలపై టిడిపి నుంచి స్పందన లేకపోయినప్పటికీ, ఈ వ్యవహారంలో ఎక్కువగా ఇబ్బంది పడేది మాత్రం పవన్ మాత్రమే.ఎందుకంటే టీడీపీకి అనుకూలంగా అమరావతి వ్యవహారంలో వైసీపీ ప్రభుత్వంపై పవన్ పోరాడుతున్నారు.

ఈ సమయంలో టిడిపి ఎమ్మెల్యే, జనసేన నాయకుడిగా ఉన్న నాగబాబు ఆరోపణలు చేయడం తో ఈ వ్యవహారంలో జనసేన కు ఇబ్బందులు తెచ్చిపెట్టే అవకాశం ఉంది.పార్టీ అధ్యక్షుడు పవన్ అనుమతి లేకుండానే నాగబాబు ఇష్టం వచ్చినట్లుగా రాజకీయ ఆరోపణలు చేస్తుండడం, వాటికి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడడంతో పవన్ అసంతృప్తిగా ఉన్నారట.

ముందు ముందు కూడా తెలుగుదేశంతో కలిసి అడుగులు వేయాలి అనుకుంటున్న పవన్ కు నాగబాబు ఇబ్బందికరంగా మారినట్టుగానే కనిపిస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Pawan Kalyan Nagababu Balakrishna Issue Related Telugu News,Photos/Pics,Images..

footer-test