పవన్ సినిమాల రీ షెడ్యూల్‌.. కాస్త అటు ఇటుగా అదే ప్లాన్‌

పవన్‌ కళ్యాణ్‌ అజ్ఞాత వాసి తర్వాత దాదాపు మూడు సంవత్సరాలు గ్యాప్‌ తీసుకుని బాలీవుడ్‌ హిట్‌ మూవీ పింక్ ను రీమేక్ చేసేందుకు సిద్దం అయ్యాడు.ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ పవన్‌ కళ్యాన్‌ సినిమా లకు కమిట్‌ అవుతూనే ఉన్నాడు.

 Pawan Kalyan Movies All Reschedule Shooting Starts Soon-TeluguStop.com

క్రిష్ దర్శకత్వం లో ఒక సినిమాను హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో మరో సినిమా ను చేసేందుకు ఓకే చెప్పిన పవన్‌ కళ్యాణ్‌ ఇప్పటికే పింక్ రీమేక్ అయిన వకీల్‌ సాబ్‌ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.వకీల్‌ సాబ్ తర్వాత పవన్‌ కళ్యాణ్‌ ఈ ఏడాదిలోనే మలయాళం సూపర్‌ హిట్‌ మూవీ అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌ రీమేక్ తో రావాల్సి ఉంది.

కాని కరోనా కారణంగా ఆ సినిమా షూటింగ్ నిలిచి పోయింది.పవన్ రీమేక్ ను పూర్తి చేసి క్రిష్ సినిమా ను పునః ప్రారంభించి అదే సమయంలో హరీష్‌ శంకర్‌ మూవీని కూడా మొదలు పెట్టాల్సి ఉంది.

 Pawan Kalyan Movies All Reschedule Shooting Starts Soon-పవన్ సినిమాల రీ షెడ్యూల్‌.. కాస్త అటు ఇటుగా అదే ప్లాన్‌-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కాని కరోనా వల్ల మొత్తం ప్లాన్ రివర్స్ అయ్యింది.

మార్చి నెలలో పక్కా ప్రణాళికతో పవన్‌ సినిమా లు ముందుకు సాగాయి.కాని రెండు నెలల గ్యాప్ వల్ల మొత్తం అటు ఇటు గా మారిపోయాయి.కరోనా నుండి కోలుకున్న పవన్‌ కళ్యాణ్ ఈ నెల చివరి నుండి లేదా వచ్చే నెల నుండి మొదట అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌ రీమేక్ లో నటించబోతున్నాడు.

దాదాపుగా మూడు నుండి నాలుగు వారాల పాటు కంటిన్యూగా ఆ సినిమా షూటింగ్‌ లో పవన్ పాల్గొంటాడు.ఆ వెంటనే క్రిష్ దర్శకత్వం లో సినిమా అయిన హరి హర వీరమల్లు సినిమా ను పునః ప్రారంభించబోతున్నాడు.

ఆ తర్వాత హరీష్‌ శంకర్ దర్శకత్వం లో సినిమాను మొదలు పెట్టబోతున్నాడు.అయ్యప్పనుమ్‌ రీమేక్ ను ముందుగా అనుకున్నట్లుగా ఈ ఏడాదిలోనే విడుదల చేసే అవకాశం ఉంది.

కాని హరి హర వీరమల్లు మాత్రం వచ్చే ఏడాది సమ్మర్‌ కాకుండా కాస్త ఆలస్యంగా విడుదల చేయాలని భావిస్తున్నారు.ఇక హరీష్‌ శంకర్ మూవీ వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదల చేస్తారని అంటున్నారు.

మొత్తంగా పవన్‌ వరుసగా సినిమా లతో మళ్లీ బిజీ అవ్వబోతున్నాడు.

#Vakeel Saab #Pawan Kalyan #HariharaVeera #PawanBack #Harish Shankar

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు