Harish Shankar Pawan Kalyan: హరిష్‌ శంకర్‌ అన్నా... ప్లీజ్ వెంటనే ఏదో ఒకటి చేసేయ్

గబ్బర్ సింగ్ తో పాటు ఎన్నో సక్సెస్ సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు హరిష్‌ శంకర్ గద్దల కొండ గణేష్‌ సినిమా తర్వాతి సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే.ఆయన మరో సారి గబ్బర్ సింగ్ కాంబినేషన్ ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చి సూపర్ హిట్ అందుకోవాలని ఉద్దేశం తో పవన్ కళ్యాణ్ కి భవదీయుడు భగత్ సింగ్ అనే కథ ను చెప్పి ఒప్పించాడు.

 Pawan Kalyan Movie With Harish Shankar Details, Pawan Kalyan, Director Harish Sh-TeluguStop.com

అధికారిక ప్రకటన కూడా వచ్చింది.సినిమా అతి త్వరలోనే షూటింగ్ ప్రారంభం కాబోతుంది అనుకుంటున్న సమయం లో అనూహ్యంగా పవన్ కళ్యాణ్ రాజకీయాలతో బిజీ అవ్వడం ఇతర సినిమా లకు ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వడం తో దర్శకుడు హరీష్ శంకర్ ఏం చేయాలో పాలు పోక అటు ఇటు తిరుగుతున్నాడట.

ఆ మధ్య తెలుగు యంగ్ హీరో తో సినిమా చేయబోతున్నాడు అంటూ వార్తలు వచ్చాయి.ఆ తర్వాత బాలీవుడ్ లో ఒక స్టార్ హీరో కి హరీష్ శంకర్ సినిమా కథ చెప్పాడు అంటూ వార్తలు వచ్చాయి.

కానీ ఇప్పటి వరకు ఆయన ఏ ఒక్క హీరో కి కథ కానీ.స్క్రిప్ట్ కానీ చెప్పలేదు.కేవలం పవన్ కళ్యాణ్ కి గతంలో చెప్పిన భవదీయుడు భగత్ సింగ్ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ లోనే ఉన్నాడట.ఈ నేపద్యంలోనే ఆయన అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికైనా వెంటనే సినిమా చేయాలని… అది పవన్ కళ్యాణ్ తో కాకుండా మరెవరితో నైనా చేయాలి అంటూ విజ్ఞప్తి చేస్తున్నారు.హరీష్ శంకర్ మంచి ప్రతిభ ఉన్న దర్శకుడు ఇలా పవన్ కళ్యాణ్ వంటి హీరోల వద్ద అతడి యొక్క టైం అంతా వృధా చేసుకోవద్దు అంటూ అభిమానులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Telugu Harish Shankar, Gaddalakonda, Pawan Kalyan, Pawankalyan, Telugu, Top Telu

పవన్ తో సినిమా ఇప్పుడు కాకుండా తర్వాత అయినా చేసుకోవచ్చు.ఆయన డేట్ లో ఇచ్చిన సమయంలో సినిమాను చేయడానికి ఇప్పటి నుండే రెడీగా ఉండాల్సిన అవసరం లేదని కొందరు సూచిస్తున్నారు.పవన్ కళ్యాణ్ తో సినిమా కంటే ముందు రెండు లేదా మూడు చిన్న సినిమా లను హరీష్ శంకర్ పూర్తి చేసి ఉంటే బాగుండేది అంటూ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికైనా ప్లీజ్ హరీష్ శంకర్ అన్నా మీరు వేరే సినిమా లను చేసి మా ముందుకు తీసుకురండి అంటూ అభిమానులు విజ్ఞప్తి చేస్తున్నారు.

మరి హరీష్ శంకర్ కి ఈ విజ్ఞప్తి అందుతుందా అనేది చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube