వీడియో : భీమ్లా నాయక్‌ సంక్రాంతికి వచ్చేస్తున్నాడట

పవన్ కళ్యాణ్‌, రానా కలిసి నటిస్తున్న సినిమా షూటింగ్‌ నిన్న పునః ప్రారంభం అయిన విషయం తెల్సిందే.షూటింగ్‌ ను ప్రారంభించడానికి ముందు సినిమాటోగ్రాఫర్ విషయమై వివాదం ఏర్పడింది.

 Pawan Kalyan Movie Making Video-TeluguStop.com

దాంతో కొన్ని రోజుల పాటు షూటింగ్‌ ను వాయిదా వేశారు.తాజాగా సినిమాటోగ్రాఫర్ గా కొత్త వారిని తీసుకుని మళ్లీ షూటింగ్‌ ను పునః ప్రారంభించారు.

దాంతో పవన్ అభిమానులు మళ్లీ ఫుల్‌ హ్యాపీ మూడ్‌ లో ఉన్నారు.ఈ సినిమా లో పవన్‌ పాత్ర పేరు భీమ్లా నాయక్‌ అంటూ ఇప్పటికే అధికారికంగా ప్రకటించిన చిత్ర యూనిట్‌ సభ్యులు తాజాగా మేకింగ్ వీడియోను విడుదల చేశారు.

 Pawan Kalyan Movie Making Video-వీడియో : భీమ్లా నాయక్‌ సంక్రాంతికి వచ్చేస్తున్నాడట-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ వీడియోలో పవన్‌ కళ్యాణ్‌ స్టైలిష్‌ లుక్ ను రివీల్‌ చేశారు.పోలీస్ గా చాలా కాలం తర్వాత పవన్‌ కళ్యాణ్‌ ను చూడటంతో అభిమానులు చాలా హ్యాపీగా ఉన్నారు.

ఈ సినిమా ను సంక్రాంతికి తీసుకు రాబోతున్నట్లుగా కూడా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

భీమ్లా నాయక్‌ పాత్రలో పవన్ కళ్యాణ్‌ ఓ రేంజ్‌ లో ఆకట్టుకోవడం ఖాయం అనిపిస్తుంది.ఎందుకంటే మలయాళ అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌ లో పోలీస్‌ ఆఫీసర్‌ పాత్ర చాలా పవర్ ఫుల్‌ గా ఉంటుంది.డ్యూటీ అంటే ప్రాణం ఇచ్చేందుకు అయినా సిద్దంగా ఉండే పాత్రలో పవన్‌ కనిపించబోతున్నాడు.

కనుక ఖచ్చితంగా మరో సారి భీమ్లాగా పవన్ కళ్యాణ్‌ ఆకట్టుకుంటాడు అనే నమ్మకంను అంతా వ్యక్తం చేస్తున్నారు.ప్రస్తుతం సినిమా షూటింగ్‌ ను హైదరాబాద్‌ లో శరవేగంగా పూర్తి చేసే పనిలో ఉన్నారు.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం సినిమాను అక్టోబర్‌ వరకు ముగించే ప్లాన్‌ చేస్తున్నారు.ఆ తర్వాత సినిమా ను విడుదల చేయాలని భావించినా కూడా ఇతర పెద్ద సినిమాలు ఉన్నాయి.

కనుక సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చారు.ఈ సినిమా షూటింగ్‌ తర్వాత హరి హర వీరమల్లు సినిమా షూటింగ్‌ లో జాయిన్‌ కాబోతున్నాడు.

#PawanBheemla #Bheemla Nayak #Pawan Kalyan #Rana #Pawan Rana

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు