పవన్ కి క్లారిటీ మిస్..సతమతమవుతున్న జనసేనాని       2018-06-30   00:53:49  IST  Bhanu C

గత ఏడాది ఎన్నికల సమయంలో పెట్టిన జనసేన పార్టీ అప్పట్లో ఎలాంటి క్లారిటీ తో పవన్ కళ్యాణ్ ఉన్నాడో ఇప్పటికీ అదేవిధమైన మైండ్ సెట్ తో ఉన్నాడని తెలుస్తోంది..స్టేజీ ఎక్కి ఎదో నాలుగు మాటలు మాట్లాడటం.. కుర్రాళ్ళు హుషారు గా ఉండటానికి గొంతు పోయేలా మరో రెండు అరుపులు అరవడం ఇది పరిపాటి అయ్యింది. అప్పటికి ఇప్పటికే ఉన్న తేడా ఒక్కటే అప్పుడు తెలుగుదేశం పార్టీ తో దోస్తీ కడితే ఇప్పుడు పవన్ ప్రత్యక్ష ఎన్నికలకి సిద్దం అవుతూ వామపక్షాలతో జట్టు కడుతున్నాడు…అయితే

జనసేనాని ఈ మధ్య కొంచం దూకుడుగానే వెళ్తున్నట్లుగా అనిపించినా ఎక్క‌డో ఏదో తేడా కొడుతుంద‌నే ఆలోచ‌న మాత్రం ప‌వ‌న్‌ను వెంటాడుతుంద‌ట‌. అయితే ఏదీ అనేదానిపై ఇప్ప‌టికైతే క్లారిటీ రాలేద‌ట‌. గ‌త‌నెల‌లో ఉత్త‌రాంధ్ర నుంచి ప‌ర్య‌ట‌నకు శ్రీకారం చుట్టిన ప‌వ‌ర్‌స్టార్ జ‌నాల్లోకి బాగానే చేర‌గ‌లిగారు…అయితే అదే స‌మ‌యంలో ఎమోష‌న‌ల్‌గా కూడా జ‌నాల్లో త‌న‌కంటూ ప్ర‌త్యేక ముద్రను వేయించుకోగ‌లిగారు…తన సభలకి సైతం భారీ స్థాయిలో జనాలు కూడా వస్తున్నారు..కాని వాటిని ఓట్లుగా మలుచుకోగాలరా అంటే ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి..

అయితే గతంలో తన అన్న చిరంజీవి ఆప్ప‌ట్లో ప్ర‌జారాజ్యం సభలకి సైతం జ‌నం తండోప‌తండాలుగా వ‌చ్చారు. అవ‌న్నీ ఓటుబ్యాంకుగా మార‌క‌పోవ‌టం వ‌ల్ల చిరుకి ఘోరమైన పరాభవం తప్పలేదు..అదే అనుభ‌వం ప‌వ‌న్‌కు ఎదుర‌వ‌టం.. కాస్త అయోమయాన్ని క‌లిగిస్తుందంట‌. మ‌రో విష‌యానికి వ‌స్తే.. ప‌వ‌న్ ఎక్క‌డ నుంచి పోటీచేయాలి అనే విషయంపై ఇప్పటికే కూడా ఒక్క క్లారిటీ ప్రకటన లేదు అన్ని పార్టీ నేతలకి తాము పోటీ చేసే స్థానాల పై క్లారిటీ ఉంటుంది కానీ పవన్ కి ఆ క్లారిటీ మొదటి నుంచీ మిస్ అవుతూనే వచ్చింది. అప్ప‌ట్లో తాను అనంత‌పురం నుంచి పోటీ ఉంటుంది అని చెప్పిన పవన్ కళ్యాణ్ తరువాత కాదు కాదు నా ప్రాధాన్యత ఉత్తరాంధ్ర కే అంటూ చెప్పడంతో పవన్ అభిమానులు సమాయుత్త కాలేకపోతున్నారు..ఎంతో తీవ్ర నిరాసకి లోనవుతున్నారు.

అయితే పవన్ కళ్యాణ్ కి ఈ క్లారిటీ లోపంతో గెలుపు బెంగ పట్టుకుందా అందుకే ఎక్కడ నుంచీ పోటీ చేయాలో డిసైడ్ అవ్వలేక పోతున్నారా. తన అన్న లాగానే తిరుపతి ,పాలకోలు అంటూ రెండు ఆప్షన్లు పెట్టుకున్నారా అని సందేహం వ్యక్తం చేస్తున్నారు పరిశీలకులు..ఇదిలాఉంటే పొత్తు విషయంలో కూడా ముందే ప్రకటన చేసేశారు పవన్ వచ్చే ఎన్నికల్లో ప్రధాన పార్టీలు అన్నీ ఒంటరిగానే ముందుకు వెళ్తున్న సమయంలో జెండా తప్ప జనం లేని వామపక్షాల ని కలుపుకుని వెళ్లాలని అనుకోవడం పవన్ మూర్ఖత్వానికి నిదర్సనం అంటున్నారు విశ్లేషకులు.