నిర్మలా సీతారామన్ తో పవన్ భేటీ! రాజధానిపై కీలక వ్యాఖ్యలు  

Pawan Kalyan Met With Nirmala Sitharaman In Delhi-bjp,delhi,janasena,nirmala Sitharaman,pawan Kalyan

పవన్ కళ్యాణ్ తన హస్తిన పర్యటనలో భాగంగా నేడు బీజేపీ నేతలతో కలిసి కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ కి కలిసారు.ఆమెతో ఓ గంట పాటు చర్చించారు.అనంతరం పవన్ కళ్యాణ్, ఏపీ బీజేపీ అధ్యక్షుడు ఢిల్లీలో మీడియా ముందుకి వచ్చి ఆసక్తికర విషయాలు మాట్లాడారు.ఏపీ ఆర్థిక పరిస్థితి, అమరావతి రాజధాని అంశాలపై మంత్రితో చర్చించడం జరిగిందని తెలిపారు.

Pawan Kalyan Met With Nirmala Sitharaman In Delhi-Bjp Delhi Janasena Nirmala

విభజన హామీలలో భాగంగా రాజధాని నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి చర్చించామని తెలిపారు.రాజధాని కోసం విభజన హామీలలో భాగంగా ఇచ్చిన నిధులలో గత ప్రభుత్వం కానిల ప్రస్తుత వైసీపీ కాని యుటిలిటీ సర్టిఫికెట్ ఇవ్వడం లేదని నిర్మలాసీతారామన్ చెప్పినట్లు తెలిపారు.


ఏపీ ప్రజలకి, అమరావతి రైతులకి మాటిస్తున్నా అని ఏపీకి శాశ్వత రాజధానిగా అమరావతి ఉంటుందని, దీనిలో ఎలాంటి మార్పు ఉండబోదని అన్నారు.దీనిపై బీజేపీ-జనసేన ఉమ్మడి కార్యాచరణ సిద్ధం చేసుకొని ముందుకి వెళ్తున్నట్లు తెలిపారు.

విశాఖలో రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించాలనుకుని మరల వైసీపీ ప్రభుత్వం వెనక్కి తగ్గినట్లు రేపు రాజధాని విషయంలో కూడా నిర్ణయం మార్చుకోక తప్పదని అన్నారు.రాజధాని మార్పు అనేది కేంద్రం పరిధిలో అంశం కాదని, దీనికి కేంద్రం అనుమతి కాని, వ్యతిరేకత కాని ఉండదని ఉండదని అయితే ఏపీ ప్రభుత్వం దీనిపై తప్పుడు ప్రచారం చేస్తుందని దయ్యబట్టారు.

దీనిపై బీజేపీ-జనసేన రాజకీయ కార్యాచరణతోనే అడ్డుకోవడం జరుగుతుందని తెలిపారు.అయితే నిన్నటి వరకు కేంద్రంతో మాట్లాడి అమరావతి రాజధాని మార్చకుండా ఉండేలా చూస్తానని చెప్పిన పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళాక ఇలా రాజధాని మార్పు కేంద్రం పరిధిలో అంశం కాదని అనడం చూస్తే అక్కడ జనసేనానికి ఆశాభంగం అయినట్లు ఉందని ఇప్పుడు వైసీపీ పార్టీ నేతలు, కార్యకర్తలు చెప్పుకుంటున్నారు.

తాజా వార్తలు

Pawan Kalyan Met With Nirmala Sitharaman In Delhi-bjp,delhi,janasena,nirmala Sitharaman,pawan Kalyan Related....