నడ్డా తో సమావేశమైన పవన్, వెనుక వ్యూహం ఏంటి  

Pawan Kalyan Meets Bjp Working President Jp Nadda-janasena Chief Pawan Kalyan,pawan Kalyan,pawan Kalyan Delhi Tour

ఒకపక్క ఏపీ లో టీడీపీ తో కుమ్మక్కై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అధికార పార్టీ పై విమర్శలు చేస్తున్నారు అంటూ ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే.అయితే ఆ ఆరోపణలను పక్కన పెడితే హస్తిన పర్యటనలో ఉన్న పవన్ భారతీయ జనతాపార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా తో సమావేశమవ్వడం ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్ గా మారింది.

Pawan Kalyan Meets Bjp Working President Jp Nadda-janasena Chief Pawan Kalyan,pawan Kalyan,pawan Kalyan Delhi Tour Telugu Political Breaking News - Andhra Pradesh,Telangana Partys Coverage-Pawan Kalyan Meets BJP Working President Jp Nadda-Janasena Chief Pawan Delhi Tour

హుటాహుటిన శనివారం బయలుదేరి ఢిల్లీ వెళ్లిన పవన్ కళ్యాణ్ అసలు ఎందుకు వెళ్లారు అన్న దానిపై క్లారిటీ లేదు.ఒకవేళ కేంద్రమే పవన్ ను పిలిపించిందా లేదంటే తనకు తాను గా పవన్ వెళ్లాడా అన్న విషయం పై స్పష్టత లేదు.

పవన్ పర్యటన రహస్యంగా సాగుతోందని ప్రచారం కూడా సాగింది.ఢిల్లీలో ఎవరితో ఆయన ఎవరెవరితో భేటీ అయ్యారు, అవుతారనేదానిపైనా గుట్టుగానే వ్యవహరించింది జనసేనపార్టీ.

అసలు పవన్ కల్యాణ్‌కు కేంద్ర మంత్రులు అపాయింట్‌మెంట్ ఇవ్వలేదని ఢిల్లీలో ఆయన నిరీక్షిస్తున్నారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.అయితే, ఇవాళ మధ్యాహ్నం జేపీ నడ్డాను కలిసిన జనసేనాని.

అనంతరం ఏపీకి తిరుగు ప్రయాణం అయ్యారు.పవన్ ఢిల్లీ నుంచి కాకినాడ వెళ్లే అవకాశం ఉందంటున్నారు.

అయితే ఇప్పుడు అసలు పవన్ భేటీ వెనుక ఉన్న కారణం మాత్రం వెల్లడికాలేదు.ఈ భేటీ లో ఏ అంశాలపై చర్చలు జరిగాయో అన్న దానిపై కూడా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.

తాజా వార్తలు

Pawan Kalyan Meets BJP Working President Jp Nadda Related....