ఒకే ఒక్కడి మాట : నేను బిజీ పవన్ సభకు వెళ్లను

ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ నుంచి ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రెండు చోట్ల నుంచి పోటీ చేసినా ఓటమి చవిచూడాల్సి వచ్చింది.కేవలం ఆ పార్టీ నుంచి ఒకే ఒక్క అభ్యర్థి గెలుపొందాడు.

 Pawan Kalyan Meetings Janasena Rapaka Varaprasad-TeluguStop.com

ఆయనే రాజోలు ఎమ్యెల్యే రాపాక వరప్రసాద్.మిగతా వారిలో చాలామంది డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయారు.

ఒకే ఒక్క ఎమ్యెల్యేగా గెలుపొందడంతో రాపాక వరప్రసాద్ కు రాష్ట్ర వ్యాప్తంగా మంచి గుర్తింపు వచ్చింది.అయితే గెలిచిన నాటి నుంచి రాపాక జనసేనలో అనుమాస్పదంగానే వ్యవహరిస్తూ వస్తున్నారు.

ఈయన వ్యవహారంపై జనసేన కూడా ఏ విధంగానూ స్పందించలేకపోతోంది.

తాజాగా అసెంబ్లీ లో పార్టీ అధ్యక్షుడు పవన్ నిర్ణయానికి వ్యతిరేకంగా ఇంగ్లీష్ మీడియం కు మద్దతు మాట్లాడారుఎమ్మెల్యే రాపాక వరప్రసాద్.

ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టి సీఎం జగన్ పేద ప్రజల పిల్లలకు చాలా మంచి చేశారని ప్రశంసించారు.ఈ సందర్భంగా తమ పార్టీ గురించి సంచలన వ్యాఖ్యలు చేసారు.

తనకు, పవన్ కు మధ్య ఒక అడ్డంకి ఉందంటూ ఆయన వ్యాఖ్యానించారు.జనసేన పార్టీకి తనకు మధ్య కమ్యూనికేషన్‌ గ్యాప్‌ ఉందని, అది తొలగిపోతుందని తాము భావిస్తున్నట్టు ఆయన చెప్పారు.

చాలా మంది దళితులు ప్రైవేటు పాఠశాలల్లో చదవలేకపోతున్నారని, అందుకే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం ప్రవేశపెట్టడాన్ని తాను స్వాగతించానన్నారు.ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నానని, అందుకే చాలా బిజీగా ఉండడం వల్ల పవన్ కల్యాణ్ తలపెట్టిన రైతు దీక్షకు హాజరు కావడం కాలేదంటూ ఆయన చెప్పుకొచ్చారు.

జనసేనలో తనకు ప్రాధాన్యత ఉందా? లేదా ? అనే విషయాన్ని కొద్ది రోజుల తరువాత చెబుతానని ఆయన ప్రకటించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube