టీఆర్ఎస్ లో చిచ్చు రేపుతున్న కేసీఆర్ –పవన్ భేటీ     2018-01-03   00:12:20  IST  Bhanu C

అదేంది కేసీఆర్ తో పవన్ భేటీ అయితే టీఆర్ఎస్ లో అసంతృప్తి ఏంటి అనేగా మీ డౌట్…అయితే గమ్మున ఇది చదవండి..ప్రగతి భవన్ లో గంటపాటు వెయిట్ చేసి కేసీఆర్ రాగానే షేక్ హ్యండ్ ఇచ్చుకుంటూ ,నవ్వుకుంటూ ముచ్చట్లు చెప్పుకున్నారు ఇద్దరు పార్టీ అధినేతలు..అంతేనా ప్రగతి భవన్లో పవన్ కు కేసిఆర్ చేసిన మర్యాదలు మాములుగా లేవు అయితే ఇక్కడే పార్టీ కేడర్ గుర్రు అయ్యింది..పార్టీకి ఎప్పటి నుంచో గొడ్లులా కస్టపడి పని సేత్తుంటే మమ్మల్ని గాలికి వదిలేసి పవన్ లాంటి వాళ్ళకి కలిసెడుకి పర్మిషన్ ఇస్తారా అంటూ తెగ ఫీల్ అయ్యిపోతున్నారట…ఈ విషయంలో పార్టీ నేతలు బహిరంగంగానే తమ అసంతృప్తిని తెలుపుతున్నారు.

కొత్త సంవత్సరంలో మా అధినేత మాకు ఇంతగా షాక్ ఇస్తారా అంటూ పార్టీలో ముసలం అందుకుంది..టిఆర్ఎస్ పార్టీ ఏర్పాటైన నాటినుంచి నేటి వరకు కేసిఆర్…పార్టీ కార్యకర్తలెవరికీ అందుబాటులో ఉండరన్న విమర్శ తీవ్రంగా ఉంది. ఆయన అనుకుంటేనే అపాయింట్ మెంట్ దొరుకుతుంది…కానీ కేసీఆర్ సామాన్యంగా ఎవరికీ అందుబాటులోకి రారు వాళ్ళు ఎంత పెద్ద బడా నేతలు అయినా సరే..మాజీ లోక్సభ స్పీకర్ కలవడానికి వస్తే మొఖం చాటేసిన కేసీఆర్ కనీసం పార్టీలో ఉండే ముఖ్యమైన నేతలని కూడా కవలరు..అసలు ఎవరికీ అంత సులువుగా సారూ గారి దివ్య దర్సనం దొరకదు అని సొంత పార్టీలోనే అనుకుంటూ ఉంటారు.

అయితే ఇలాంటి సమయంలో కేసీఆర్ పై ఎన్నో విమర్శలు చేసిన పవన్ లాంటి పార్ట్ టైం పొలిటికల్ లీడర్ కి

కేసీఆర్ ఏకంగా తన అధికార నివాస భవనంలో అతిథిమర్యాదలు చూసిన తర్వాత పార్టీలో ఇంతకాలం అసంతృప్తితో ఉన్న వారంతా ఒక్కసారిగా గళం విప్పుతున్నారు. తాజాగా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు మహిళా నేత వసుంధర సోషల్ మీడియాలో ఫైర్ అయ్యారు. అసలు ఎందుకు పవన్ కళ్యాణ్ ను ప్రగతి భవన్ లోకి రానిచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యకర్తలు ఎంతగానో ఎదురుచూసినా.. అపాయింట్ మెంట్ ఇవ్వకుండా పవన్ కు ఎలా ఇచ్చారని ఆమె ప్రశ్నించారు. అంతేకాదు కేసిఆర్ అంతరంగికుడు, పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన సంతోష్ కుమార్ ను సైతం ఆమె విమర్శించారు. ఈ విషయంలో సంతన్న ఎందుకు అపాయింట్ మెంట్ ఇప్పించారని నిలదీశారు..ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కోరకంగా కేసీఆర్ పై తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు..

అయితే పవన్ కళ్యాణ్ కేసీఆర్ ని కలిసి బయటకి వచ్చిన తరువాత కేసీఆర్ 24 గంటల కరెంటు నన్ను ఆలోచింపచేసింది..కేసీఆర్ కి శుభాకాంక్షలు తెలిపాను..ఆయన చాలా మంచి పని చేస్తున్నారు అంటూ పొగడ్తలలో ముంచెత్తారు..దీంతో రేవంత్ రెడ్డి నుంచీ వీ హెచ్ హనుమంతరావు వరకూ ఒక్కొక్కళ్ళు ఒక్కో స్టైల్ లో పవన్ కి కడిగేశారు..నీకు ఒక విషయంపై తెలియనప్పుడు మాట్లాడకుండా ఉండాలి కానీ కేసీఆర్ ని అభినందించం వెనుక ఆంతర్యం ఏమిటి అంటూ విమర్శించారు..