కొత్త బీజేపీ చీప్‌ను కలిసిన జనసేనాని  

Pawan Kalyan Meet Jp Nadda-pawan Kalyan

ఏపీ రాజధాని విషయంపై కేంద్ర పెద్దలతో చర్చించేందుకు ఢిల్లీ వెళ్లిన జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ప్రస్తుతం పలువురు కేంద్ర నాయకులతో భేటీ అవుతున్నాడు.నేడు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాను పవన్‌ కళ్యాణ్‌ కలిశాడు.

Pawan Kalyan Meet JP Nadda-Pawan

ఇటీవలే జేపీ నడ్డా బీజేపీ చీప్‌ బాధ్యతలు దక్కించుకున్న విషయం తెల్సిందే.బీజేపీ కొత్త అధ్యక్షుడిగా ఎన్నిక అయిన నడ్డాకు పవన్‌ శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు రాష్ట్రంలో నెలకొని ఉన్న పరిస్థితులపై చర్చించినట్లుగా తెలుస్తోంది.


వైకాపాను గద్దె దించే వరకు విశ్రమించేది లేదు అంటూ ప్రతిజ్ఞ చేసిన పవన్‌ కళ్యాణ్‌ ప్రస్తుతం బీజేపీతో కీలక చర్చలు జరుపుతున్నాడు.వైకాపాను వచ్చే ఎన్నికల్లో మట్టికరిపించేందుకు పవన్‌ చేస్తున్న ప్రయత్నాలు ఏమేరకు సఫలం అవుతాయో చూడాలి.

ఇక ఢిల్లీ పర్యటనలో నేడు మరియు రేపు ప్రధాని నరేంద్ర మోడీ మరియు హోం మంత్రి అమిత్‌ షాలను కలిసే అవకాశం ఉందని రాజకీయ వర్గాల వారు అంటున్నారు.ప్రధాని ముందు రాజధాని విషయం ఉంచి అమరావతిని శాస్వత రాజధానిగా ఏర్పాటు చేయాలంటూ ఆదేశించాలని కోరనున్నాడు.

Pawan Kalyan meets BJP national president Nadda పవన్‌ కళ్యాణ్‌

తాజా వార్తలు