టీడీపీ ని వదలనంటున్న పవన్ ! బీజేపీ పెద్దలకు చెప్పిందిదే ?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) మూడు రోజులు పాటు ఢిల్లీలోనే మకాం వేశారు.అక్కడ బిజెపి కీలక నాయకులైన కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ప్రధాని నరేంద్ర మోది వంటి వారిని  కలిసే ప్రయత్నం చేసినా.

 Pawan Kalyan  Meet   Jp Nadda And Muralidaran In Delhi, Pavan Kalyan,  Janasena,-TeluguStop.com

వారి అపాయింట్మెంట్ పవన్ కు లభించలేదు.చివరకు బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, మురళీధరన్ ( J.P.Nadda )మరి కొంతమంది కేంద్ర మంత్రులను కలిశారు.పవన్ వెంట జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఉన్నారు.అయితే వీరి ఢిల్లీ పర్యటన వెనుక కారణాలేమిటనేది నాదెండ్ల మనోహర్ క్లారిటీ ఇచ్చారు.

ఢిల్లీ బిజెపి పెద్దలతో అనేక అంశాలపై చర్చలు జరిగాయని,  ఈ సందర్భంగా టిడిపితో పొత్తు అంశం పైన చర్చ జరిగిందని , వైసిపి వ్యతిరేక ఓటు చీలకుండా ఉండాలంటే 2014 ఎన్నికల మాదిరిగానే టిడిపి, బిజెపి ,జనసేన కలిసి 2024 ఎన్నికలను ఎదుర్కోవాలనే ప్రతిపాదనను కేంద్ర బిజెపి పెద్దల వద్ద పెట్టినట్లు మనోహర్ తెలిపారు .

Telugu Ap, Janasena, Janasenatdp, Janasenani, Jp Nadda, Muralidaran, Pavan Kalya

అయితే ఈ విషయంలో  బిజెపి ఇంకా నిర్ణయం తీసుకోలేదని,  బిజెపి నిర్ణయానికి అనుగుణంగా తమ కార్యచరణను ప్రకటించేందుకు సిద్ధమవుతున్నామంటూ మనోహర్ ప్రకటించారుబిజెపికి జనసేన మిత్రపక్షంగానే కొనసాగుతూ.తమతో టీడీపీని కలుపుకుపోవాలనే ప్రతిపాదన చేస్తున్నామని , దీనిపైన త్వరలో స్పష్టత వస్తుందన్నారు.టిడిపి ,జనసేన బిజెపి కలిసి పోటీ చేస్తే అధికారంలోకి రావొచ్చనే విషయాన్ని బిజెపి కీలక నాయకులతో పవన్ చెప్పినట్లుగా మనోహర్( Nadendla Manohar ) చెబుతున్నారు.

తాము కలిసిన బీజేపీ కీలక నాయకులతో అనేక అంశాలను చర్చంచాము అని,  వైసీపీ విముక్త ఏపీ వైపు బీజేపీ పెద్దలు అడుగులు వేస్తారనే నమ్మకం తమకు కలిగిందని మనోహర్ చెబుతున్నారు.

Telugu Ap, Janasena, Janasenatdp, Janasenani, Jp Nadda, Muralidaran, Pavan Kalya

తాము చేసిన ప్రతిపాదనపైన బీజేపీ పెద్దలు సానుకూలంగానే స్పందిస్తారని జనసేన అంచనా వేస్తోంది.అయితే టిడిపిని కలుపుకు వెళ్లే విషయంలో బిజెపి నాయకులు ఏ క్లారిటీ ఇవ్వకపోవడంతో,  కేంద్ర హోం మంత్రి అమిత్ షా,  ప్రధాని నరేంద్ర మోది మాత్రమే దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉండడం తో వారి నిర్ణయం కోసం జనసేన ఎదురుచూస్తోంది.బిజెపి నిర్ణయం వెలువడే లోపు సంస్థగతంగా జనసేన ను బలోపేతం చేసే విధంగా వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాలని నిర్ణయించుకున్నారు.

తాము ప్రతిపాదించినట్లుగా టిడిపి , జనసేన, బిజెపి కూటమి ఏర్పాటుకు బిజెపి పెద్దలు అంగీకరిస్తే సరే,  లేకపోతే టిడిపి తోనే ముందుకు వెళ్లాలనే ఆలోచనతో పవన్ ఉన్నట్లుగా తెలుస్తోంది.అయితే ఈ విషయంలో బిజెపి పెద్దలు ఏ విధంగా స్పందిస్తారు ? ఒకవేళ టిడిపిని కలుపుకు వెళ్లడం ఇష్టం లేకపోతే పవన్ విషయంలో బిజెపి పెద్దలు ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube