పవన్‌ కళ్యాణ్‌ మరో పెళ్లి??

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ ఇప్పటికే మూడు పెళ్లిలు చేసుకున్న విషయం తెల్సిందే.మొదట నందినిని పెళ్లి చేసుకుని విడాకులు ఇచ్చిన పవన్‌ ఆ తర్వాత రేణు దేశాయ్‌తో చాలా కాలం పాటు సహజీవనం చేశాడు.

 Pawan Kalyan Married 4th Time..?-TeluguStop.com

ఒక కొడుకు కూడా పుట్టిన తర్వాత రేణుదేశాయ్‌ను పవన్‌ వివాహం చేసుకున్నాడు.పెళ్లి తర్వాత వీరిద్దరికి పాప జన్మించింది.

అయితే ఏం జరిగిందో ఏమో కాని పవన్‌ ఆ మద్య రేణుదేశాయ్‌కు విడాకులు ఇచ్చి అన్నా లెగ్జినేవానే ఫారినర్‌ను పెళ్లి చేసుకున్నాడు.తాజాగా పవన్‌ మరో పెళ్లి చేసుకున్నాడు అనే పుకార్లు షికారు చేస్తున్నారు.

‘గబ్బర్‌సింగ్‌`2’లో హీరోయిన్‌గా ఎంపిక అయిన అనీష ఆంబ్రోస్‌ను పవన్‌ పెళ్లి చేసుకున్నాడు అంటూ కొంత మంది సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తున్నారు.ఇందులో ఎంత నిజం ఉందనే విషయాన్ని పక్కన పెట్టి సాధారణ ప్రేక్షకులు కూడా ఇదే నిజం అని నమ్ముతున్నారు.

ఈ పెళ్లి వార్తను పవన్‌ కళ్యాణ్‌ యాంటీ ఫ్యాన్స్‌ స్ప్రెడ్‌ చేస్తున్నారు.ఇలాంటి వార్తలను పుట్టించే వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలంటూ పవన్‌ ఫ్యాన్స్‌ డిమాండ్‌ చేస్తున్నారు.

పవన్‌ కళ్యాణ్‌ ‘గబ్బర్‌సింగ్‌`2’ మూవీ ఈనెలాఖరున ప్రారంభం కానున్న విషయం తెల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube