పవన్‌ ఫ్యాన్స్‌ రేపు రికార్డ్‌ బద్దలు కొట్టడం ఖాయమా?

టాలీవుడ్‌ స్టార్‌ హీరోల ఫ్యాన్స్‌ మద్య ప్రస్తుతం ట్విట్టర్‌లో కోల్డ్‌ వార్‌ సాగుతోంది.ఒకరిపై ఒకరు పై చేయి సాధించేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు.

 Pawan Kalyan Fans Going To Break World Record , Pawan Kalyan, Mahesh Babu, Birth-TeluguStop.com

ఎన్టీఆర్‌ బర్త్‌డే హ్యాష్‌ ట్యాగ్‌ను పవన్‌ ఫ్యాన్స్‌ బ్రేక్‌ చేసి కొత్త రికార్డును సృష్టించారు.ఇక పవన్‌ ఫ్యాన్స్‌ రికార్డును ఈజీగా మహేష్‌బాబు కామన్‌ డీపీ హ్యాష్‌ ట్యాగ్‌తో బద్దలు కొట్టారు.

ఇక తమ రికార్డును తామే బర్త్‌ డే హ్యాష్‌ ట్యాగ్‌తో మహేష్‌ బాబు ఫ్యాన్స్‌ బద్దలు కొట్టి ఏకంగా ప్రపంచ రికార్డును నమోదు చేశారు.

మహేష్‌బాబు ఆరు కోట్ల ట్వీట్స్‌ను కేవలం 24 గంటల్లో చేయడంతో ప్రపంచ రికార్డు అయ్యింది.

ఇప్పుడు ఆ రికార్డును పవన్‌ కళ్యాణ్‌ ఫ్యాన్స్‌ బ్రేక్‌ చేసేందుకు సిద్దం అవుతున్నారు.వచ్చే నెలలో పవన్‌ బర్త్‌డే ఉంది.ఆ సందర్బంగా రేపు బర్త్‌డే కామన్‌ డీపీ విడుదల కాబోతుంది. ఆ హ్యాష్‌ ట్యాగ్‌ను ఏడు కోట్ల ట్వీట్స్‌తో దద్దరిల్లేలా చేయాలని నిర్ణయించుకున్నారు.

అందుకు సంబంధించిన ట్రెండ్‌ అలర్ట్‌ అభిమానులందరికి కూడా వెళ్లింది.రికార్డు స్థాయిలో పవన్‌ ఫ్యాన్స్‌ హ్యాష్‌ ట్యాగ్‌ ట్వీట్స్‌ చేయనున్నారు.

Telugu Mahesh Babu, Ntr, Pawan Kalyan, Pawankalyan-

పవన్‌ కళ్యాణ్‌ కామన్‌ డీపీ అత్యంత విభిన్నంగా ఉండటంతో పాటు ప్రపంచ రికార్డును దక్కించుకోబోతుంది.అందుకే ప్రతి ఒక్కరు కూడా రేపటి కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. పవన్‌ ఫ్యాన్స్‌ గతంలో ఎన్నో అరుదైన రికార్డులను సొంతం చేసుకున్నారు.కనుక ఈ రికార్డును వారు చేరుకోవడం పెద్ద కష్టం కానే కాకపోవచ్చు.అందుకే సినీ వర్గాల వారు కూడా ఖచ్చితంగా పవన్‌ ఫ్యాన్స్‌ పై నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube