పవన్‌ కళ్యాణ్‌ ‘మా’ ప్రెసిడెంట్‌.. నీబొంద ర నీ బోంద!!

గత కొన్ని రోజులుగా సినిమా పరిశ్రమకు సంబంధించిన వారిపై మీడియాలో వస్తున్న కథనాలు సంచలనం సృష్టిస్తున్న విషయం తెల్సిందే.పవన్‌ కళ్యాణ్‌పై శ్రీరెడ్డి, పవన్‌ కళ్యాణ్‌లు ఏ స్థాయిలో విమర్శలు చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

 Pawan Kalyan Maa President Rumors-TeluguStop.com

శ్రీరెడ్డి వ్యాఖ్యల వెనుక వర్మ ఉన్న విషయమై పవన్‌ కళ్యాణ్‌ చాలా ఆగ్రహం వ్యక్తం చేశాడు.ఫిల్మ్‌ ఛాంబర్‌లో దాదాపు అయిదు గంటల పాటు తన నిరసన తెలియజేయడం జరిగింది.

ఆ సమయంలోనే సినిమా పరిశ్రమ వారు ఎవరి దారిన వారు ఉంటున్నారని, కలిసి కట్టుగా ఉండక పోవడం వల్ల చాలా నష్టం వాటిల్లుతుంది అంటూ పవన్‌ అభిప్రాయపడ్డాడు.

మూవీ ఆర్టిస్టు అసోషియేషన్‌పై తీవ్ర స్థాయిలో పవన్‌ ఆగ్రహం వ్యక్తం చేశాడనే పుకార్లు కూడా షికారు చేశాయి.మా వారు తీసుకున్న అనాలోచిత నిర్ణయం మరియు మాలో కొనసాగుతున్న ఏకపక్ష వైఖరి కారణంగానే నేడు ఈ పరిస్థితి దాపరించిందని స్వయంగా పవన్‌ కళ్యాణ్‌ మా అధ్యక్షుడితో ఆగ్రహంగా అన్నట్లుగా తెలుస్తోంది.మా వ్యవహార శైలిపై పవన్‌ ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో గత రెండు రోజులుగా సోషల్‌ మీడియాలో పవన్‌ కళ్యాణ్‌ త్వరలో మా ప్రెసిడెంట్‌ అవ్వబోతున్నాడు అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న మా కార్యవర్గం కా పరిమితి పూర్తి కాబోతుంది.కొత్త అధ్యక్షుడిగా పవన్‌ను ఎంపిక చేసే అవకాశం ఉందని పుకార్లు షికార్లు చేస్తున్న నేపథ్యంలో మెగా ఫ్యామిలీ సంబంధీకులు స్పందించడం జరిగింది.

పవన్‌ మా అధ్యక్షుడు అంటూ వస్తున్న పుకార్లు పూర్తిగా అవాస్తవం అని, ఇప్పటి వరకు పవన్‌కు అలాంటి ఆలోచన లేదని, సినిమా పరిశ్రమ వదిలేసి పూర్తిగా రాజకీయాలకు పరిమితం అవ్వాలనుకుంటున్న పవన్‌ ఎందుకు మా అధ్యక్షుడు కావాలని కోరుకుంటాడు అంటూ మెగా వర్గాల వారు ప్రశ్నిస్తున్నారు.

పవన్‌ కళ్యాణ్‌ మళ్లీ సినిమాల్లో నటిస్తాడో లేదో కూడా తెలియదు.

ఆయన ఒకవేళ నటించినా కూడా మా అధ్యక్షుడిగా పని చేయడం అనేది ఆయన వ్యవహార శైలికి ఏమాత్రం సరిపోయేది కాదు.ఆయన స్థాయిని మా అధ్యక్ష పీఠం తగ్గించినట్లుగానే ఉంటుందని ఆయన అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

పవన్‌ను తాము కేవలం సీఎంగా మాత్రమే చూడాలని కోరుకుంటున్నామని, మా అధ్యక్షుడిగా, నిర్మాతల మండలి చైర్మన్‌గా కోరుకోవడం లేదు అంటూ ఫ్యాన్స్‌ సోషల్‌ మీడియాలో కామెంట్స్‌ చేస్తున్నారు.సో పవన్‌ మా అధ్యక్షుడు అనే వార్తలు కేవలం పుకార్లు మాత్రమే అని క్లారిటీ వచ్చేసింది.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube