క్రిష్ మూవీ నుంచి పవన్ కళ్యాణ్ లుక్ లీక్... సోషల్ మీడియాలో వైరల్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఫ్యాన్స్ కి పూనకాలు వచ్చేస్తాయి.అతను నటిస్తున్న సినిమాలలో పవర్ స్టార్ లుక్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలని చాలా ఆసక్తి చూపిస్తూ ఉంటారు.

 Pawan Kalyan Look Photos Leak In Social Media, Tollywood, Director Krishn, Veera-TeluguStop.com

ఎవరైనా షూటింగ్ జరుగుతున్న సమయంలో అక్కడి ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెడితే వాటిని వైరల్ చేసేస్తారు.గతంలో వకీల్ సాబ్ సినిమా షూటింగ్ సమయంలో అదే జరిగింది.

షూటింగ్ లొకేషన్ నుంచి పవన్ కళ్యాణ్ ఫోటోలు లీక్ అయ్యి బయటకి వెళ్ళిపోయాయి.ఆ మధ్య అయ్యప్పన్ కోశియమ్ రీమేక్ షూట్ కి సంబందించి పవన్ కళ్యాణ్ లుక్ లీకైంది.

ఈ లీకైన ఫోటోలు అన్ని కూడా పవన్ కళ్యాణ్ విషయంలో సినిమా మీద మరింత హైప్ కి క్రియేట్ చేస్తూ ఉంటాయి.గతంలో అత్తారింటికి దారేది సినిమాలో విషయంలో అలాగే అయ్యింది.

ఇదిలా ఉంటే ఇప్పుడు క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ పీరియాడికల్ కథాంశంతో సినిమా చేస్తున్నాడు.

మొఘలాయిల కాలం నాటి కథతో ఈ సినిమా తెరకెక్కుతుంది.

ఇందులో విప్లవయోధుడుగా పవన్ కళ్యాణ్ కనిపించబోతున్నాడు.ఇదిలా ఉంటే ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ శివారులో ప్రత్యేకంగా వేసిన మొఘలాయిల కాలం నాటి హైదరాబాద్ సెట్ లో జరుగుతుంది.

అయితే ఈ సినిమా షూటింగ్ లొకేషన్ లో పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ లుక్ కి సంబందించిన కొన్ని ఫోటోలు లీక్ అయ్యాయి.క్రిష్ ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ లుక్ ని పూర్తి స్థాయిలో రివీల్ చేయలేదు.

అయితే ఇప్పుడు ఆయన లుక్ ఎలా ఉందో ఫోటోల ద్వారా బయటకి వచ్చేసింది.ఈ ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

శివరాత్రి సందర్భంగా ఈ సినిమా టైటిల్ తో పాటు పవన్ కళ్యాణ్ లుక్ ని క్రిష్ రివీల్ చేయాలని అనుకున్నారు.అయితే అంతకంటే ముందుగానే ఇలా లీకైన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube