కొండవీటి సింహంలో చిరంజీవిని గుర్తు చేస్తున్న పవన్! కొత్త సినిమా లుక్ వైరల్

టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పింక్ సినిమాతో పాటు క్రిష్ దర్శకత్వంలో పీరియాడికల్ యాక్షన్ డ్రామాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఈ రెండు సినిమాలు ఇప్పటికే షూటింగ్ స్టార్ట్ చేసుకున్నాయి.

 Pawan Kalyan Look Like Robin Hood For Krish Movie-TeluguStop.com

పింక్ సినిమా కోసం గెడ్డంతో కనిపించిన పవన్ కళ్యాణ్ క్రిష్ దర్శకత్వంలో మూవీ కోసం కాస్తా డిఫరెంట్ గా క్లీన్ సేవ్ తో, పాతకాలపు హెయిర్ స్టైల్ తో కనిపించబోతున్నాడు.ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ కనిపిస్తున్న లుక్ లోనే క్రిష్ మూవీలో కనిపించబోతున్నాడు.

అయితే అతని ఆహార్యం ఎలా ఉంటుంది అనే విషయంలో పవన్ కళ్యాణ్ ఫాన్స్ కి ఆసక్తి ఉంది.

ఈ నేపధ్యంలో తాజాగా క్రిష్ సినిమాకి సంబందించిన పవన్ కళ్యాణ్ లుక్ ఒకటి బయటకి వచ్చింది.

ఈ లుక్ లో నుదుటిపై నిలువుగా పెద్ద బొట్టు పెట్టుకొని కొండవీటి సింహంలో చిరంజీవి తరహాలో ఆహార్యంతో కనిపిస్తున్నాడు.ఈ సినిమాలో పెద్దలని కొట్టి పేదలకి పెట్టె రాబిన్ హుడ్ తరహా పాత్రలో పవన్ కళ్యాణ్ నటించబోతున్నట్లు టాక్ బయటకి వచ్చిన సంగతి తెలిసిందే.

దానికి తగ్గట్లుగానే చాలా గంభీరంగా పవన్ కళ్యాణ్ లుక్ ఉంది.ఈ లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది.

పవన్ కళ్యాణ్ క్రిష్ కాంబినేషన్ లో రాబోయే సినిమాలో లుక్ ఇదే అని ఫాన్స్ అందరూ షేర్ చేసుకుంటున్నారు.మరి ఇందులో వాస్తవం ఎంత అనేది మాత్రం తెలియదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube