మార్షల్ ఆర్ట్స్ లో సరికొత్త యుద్ధకళ నేర్చుకుంటున్న పవన్ కళ్యాణ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ లో ప్రావీణ్యం పొందిన సంగతి అందరికి తెలిసిందే.అతని మార్షల్ ఆర్ట్స్ టాలెంట్ ని చాలా సినిమాలలో చూపించాడు కూడా.

 Pawan Kalyan Learn Martial Arts And Felicitate To Trainer, Tollywood, Director K-TeluguStop.com

ఇక అతని యాక్షన్ సీక్వెన్స్ కూడా మార్షల్ ఆర్ట్స్ ని పోలి ఉంటాయి.అతని శైలికి తగ్గట్లే యాక్షన్ డైరెక్టర్స్ పవన్ కళ్యాణ్ కి ఫైట్స్ సీక్వెన్స్ సిద్ధం చేస్తారు.

అయితే పవర్ స్టార్ పవన్ మార్షల్ ఆర్ట్స్ విద్యలో రానిస్తున్నవారిని గుర్తించి వారికి ఏదో ఒక రూపంలో సహకారం అందిస్తూ ఉంటాడు.ఇదిలా ఉంటే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ మొఘలాయిల కాలం నాటి బందిపోటు దొంగ పాత్రలో కనిపిస్తున్నాడు.ఇక ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ సరికొత్తగా ఉండే విధంగా క్రిష్ ప్లాన్ చేస్తున్నాడు.

అప్పటి ప్రాచీన యుద్ధకళ అయిన మార్షల్ ఆర్ట్స్ ప్రధానంగా భారీ ఫైట్ సీక్వెన్స్ ఉండే విధంగా ప్లాన్ చేస్తున్నాడు.పవన్ కళ్యాణ్ కూడా ప్రాచీన యుద్ధకళలని గుర్తించి వాటిని మళ్ళీ వెలుగులోకి తీసుకురావడం కోసం తన సినిమాలలో వాటి బ్యాక్ డ్రాప్ లో ఫైట్స్ ఉండే విధంగా ప్లాన్ చేయిస్తున్నారు.

ఈ నేపధ్యంలో అయ్యప్పన్ కోశియమ్ సినిమా కోసం మల్లయుద్ధం నేపధ్యంలో ఒక యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కించడంతో పాటు, మల్లయోధులకి సన్మానం చేసి వారికి ఆర్ధిక సాయం చేశారు.

ఇక ఇప్పుడు క్రిష్ సినిమా కోసం మార్షల్ ఆర్ట్స్ లో వింగ్ చున్ స్టైల్ లో యాక్షన్ సీక్వెన్స్ ప్లాన్ చేస్తున్నారు.

ఈ విద్యని నేర్పించే గురువు గురించి సెర్చ్ చేసి నెల్లూరుకి చెందిన ప్ర‌భాక‌ర్‌రెడ్డిని పిలుపించుకొని విద్య నేర్చుకున్నారు.అదే సమయంలో అతను చేస్తున్న సేవని గుర్తించి ట్రస్ట్ ద్వారా లక్ష రూపాయిల ఆర్ధిక సాయం అందించారు.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ మార్ష‌ల్ ఆర్ట్స్‌లో విదేశాల్లో శిక్ష‌ణ తీసుకుని అనేక‌మైన అవార్డుల‌ను సొంతం చేసుకున్న ప్ర‌భాక‌ర్‌రెడ్డి పెద్ద పెద్ద న‌గ‌రాల‌కు వెళ్ల‌కుండా త‌న సొంతూళ్లోనే ఉంటూ యువ‌త‌కు శిక్ష‌ణ ఇవ్వ‌డం సంతోష‌క‌రంగా ఉంద‌ని అన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube