ఏప్రిల్ లో ముగియనున్న పవన్ షూటింగ్... మరి విడుదల..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దాదాపు మూడేళ్ళ గ్యాప్ తర్వాత టాలీవుడ్ లో శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నటువంటి “లాయర్ సాబ్” అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.అయితే ఈ చిత్రం బాలీవుడ్ లో సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ నటించిన టువంటి “పింక్” చిత్రానికి ఈ చిత్రం రీమేక్ గా ఉంది.

 Pawan Kalyan Lawyer Saab Movie Shooting Update-TeluguStop.com

ఈ చిత్రాన్ని టాలీవుడ్ ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు.

అయితే తాజాగా ఈ ఈ చిత్రానికి సంబంధించి నటువంటి పలు కోర్టు సన్నివేశాలు చిత్రీకరణ జరుపుకుంటున్నట్లు సమాచారం.

అయితే ఇందుకుగాను పవన్ కళ్యాణ్ తన బాడీ లాంగ్వేజ్ పాత్రకి తగ్గట్టుగా మార్చుకున్నట్లు తెలుస్తోంది.అంతేగాక ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి నటువంటి పలు కీలక సన్నివేశాలు కూడా పూర్తయినట్లు సమాచారం.

అయితే చిత్ర మొత్తానికి సంబంధించి నటువంటి షూటింగ్ ఏప్రిల్ మొదటి వారంలో పూర్తి కానున్నట్లు తెలుస్తోంది.అలాగే దర్శకుడు శ్రీరామ్ వేణు ఈ చిత్రాన్ని మే 15వ తారీఖు న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడు.

అయితే గతంలో పవన్ కళ్యాణ్ నటించిన టువంటి గబ్బర్సింగ్ చిత్రం కూడా మే నెలలో విడుదలై టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ సాధించింది.దీంతో మరోసారి ఈ సెంటిమెంట్ మీద లాయర్ సాబ్ చిత్రాన్ని కూడా విడుదల చేసేందుకు నిర్మాత దిల్ రాజు కూడా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.

అయితే పవన్ కళ్యాణ్ తాజాగా మరో చిత్రంలో కూడా నటిస్తున్నాడు.ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు క్రిష్ దర్శకత్వం వహిస్తున్నాడు.అయితే ఈ చిత్రంలో ఒకప్పుడు ఖుషి సినిమాలో పవన్ సరసన ఆడిపాడినటువంటి భూమిక కూడా మరోసారి ఈ చిత్రంలో పవన్ కి జోడి గా నటిస్తున్నట్లు తెలుస్తోంది.

#Pawan Kalyan #Pawan Kalyan #Saab #Pawan Kalyan #Saab

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు