పవన్‌ 27 చిత్రం కొత్త టైటిల్‌ అదిరింది

పవన్‌ కళ్యాణ్‌ వకీల్‌ సాబ్‌ చిత్రం ఈ ఏడాది చివరి వరకు విడుదల అయ్యే అవకాశం కనిపిస్తుంది.ఆ చిత్రం విడుదల అయినా కాకున్నా షూటింగ్‌ పూర్తి అయిన వెంటనే క్రిష్‌ దర్శకత్వంలో మూవీని పవన్‌ రెడీ అయ్యే అవకాశం ఉంది.

 Pawan Kalyan And Krish Movie Tittle Is Veera Vajram Wiral In Social Media, Pawan-TeluguStop.com

వీరిద్దరి కాంబో మూవీకి సంబంధించి షూటింగ్‌ ఇప్పటికే ప్రారంభం అయ్యింది.అయితే కరోనా కారణంగా సినిమా షూటింగ్‌ షురూ అయ్యే పరిస్థితి లేదు.

మొఘలుల సామ్రాజ్యంలో ఒక దొంగకు సంబంధించిన స్టోరీని క్రిష్‌ విభిన్నమైన రీతిలో ప్రజెంట్‌ చేయబోతున్నాడట.వీర అనే పేరుతో పవన్‌ కళ్యాణ్‌ కనిపిస్తాడని అంటున్నారు.అందుకే ఈ సినిమాకు వీర అనే టైటిల్‌ అనుకున్నారు.కాని ఇప్పటికే వీర సినిమా వచ్చింది కనుక దానికి మరో పదంను కలిపి టైటిల్‌ను కన్ఫర్మ్‌ చేస్తారట.

‘వీర వజ్రం’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారనే టాక్‌ వినిపిస్తుంది.

Telugu Gajadonga, Krish, Pawan Kalyan, Vakeel, Vakeel Sahebh, Veer Vjram-

సినిమా కథ మొత్తం ఒక వజ్రం చుట్టు తిరుగుతుందని కనుక వీర వజ్రం బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం అవుతుంది.అది మాత్రమే కాకుండా గజదొంగ వీర అనే టైటిల్‌ను కూడా పరిశీలిస్తున్నారు.షూటింగ్‌కు ఇంకా చాలా సమయం ఉన్న కారణంగా ఎప్పటి వరకు ఈ విషయమై క్లారిటీ వచ్చేది తెలియదు.

సెప్టెంబర్‌లో పవన్‌ బర్త్‌డే ఉంది కనుక ఆ సమయంలో టైటిల్‌ను అనౌన్స్‌ చేస్తారేమో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube