జూలైలో ముహూర్తం పెట్టిన పవన్  

Pawan Kalyan Krish Pspk27 - Telugu Am Ratnam, Krish, Pawan Kalyan, Pspk27

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాల్లో రీఎంట్రీ ఇస్తుండటంతో ప్రేక్షకులు ఆయన సినిమాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఇప్పటికే బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘పింక్’ను తెలుగులో వకీల్ సాబ్ అనే టైటిల్‌తో రీమేక్ చేస్తున్న పవన్, తన నెక్ట్స్ మూవీని దర్శకుడు క్రిష్ డైరెక్షన్‌లో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.

 Pawan Kalyan Krish Pspk27

ఈ సినిమాను ఇప్పటికే అఫీషియల్‌గా ప్రారంభించిన ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అయితే ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించడంతో సినిమా రంగానికి చెందిన అన్ని పనులు కూడా వాయిదా పడ్డాయి.

జూలైలో ముహూర్తం పెట్టిన పవన్-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

ఈ క్రమంలో టాలీవుడ్ సినీ ప్రముఖులు తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్‌ను కలిసి సినిమా షూటింగ్‌లు నిర్వహించేందుకు పర్మిషన్ ఇవ్వాల్సిందిగా కోరారు.అయితే కొన్ని నిబంధనలు పాటిస్తూ సినిమా షూటింగ్‌లు నిర్వహించుకోవాలని కేసీఆర్ సూచించాడు.

అయితే ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ వరుసగా తన సినిమా షూటింగ్‌లు మొదలుపెట్టాలని ఆలోచిస్తున్నాడు.

ఈ మేరకు వకీల్ సాబ్ చిత్ర షూటింగ్‌ను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చూస్తున్న పవన్, దర్శకుడు క్రిష్‌తో చేయబోయే సినిమాను జూలైలో ప్రారంభించాలని చూస్తున్నాడు.

అప్పటివరకు కరోనా వైరస్ వల్ల ఏర్పడ్డ పరిస్థితులు కూడా చక్కబడతాయని ఆయన ఆశిస్తున్నాడు.ఇక ఈ సినిమాను తమిళ నిర్మాత ఏఎం రత్నం ప్రొడ్యూస్ చేస్తుండగా పీరియాడికల్ మూవీగా ఈ సినిమాను తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Pawan Kalyan Krish Pspk27 Related Telugu News,Photos/Pics,Images..

footer-test