పవన్ సినిమాపై క్రిష్ క్లారిటీ ఇవ్వలేదుగా!  

Is Pawan Kalyan Krish Film A Pan India Movie, Pawan Kalyan, Krish, Pan India Movie, Tollywood News - Telugu Krish, Pan India Movie, Pawan Kalyan, Tollywood News

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ వకీల్ సాబ్ ఇప్పటికే మెజారిటీ శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాతో పవన్ అదిరిపోయే రీఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నాడు.

 Pawan Kalyan Krish Pan India Movie Pink

బాలీవుడ్‌లో సూపర్ సక్సెస్ అయిన ‘పింక్’ చిత్రాన్ని వకీల్ సాబ్‌గా తెలుగులో రీమేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే.ఈ సినిమాను దర్శకుడు వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే.

ఇక ఈ సినిమా రిలీజ్ కాకముందే పవన్, తన నెక్ట్స్ చిత్రాన్ని మొదలుపెట్టేందుకు రెడీ అయ్యాడు.

పవన్ సినిమాపై క్రిష్ క్లారిటీ ఇవ్వలేదుగా-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

దర్శకుడు క్రిష్ డైరెక్షన్‌లో పవన్ తన నెక్ట్స్ చిత్రాన్ని ఓకే చేశాడు.

ఈ సినిమాకు విరూపాక్ష అనే టైటిల్‌ను చిత్ర యూనిట్ పెట్టేందుకు రెడీ అయ్యారు.కాగా ఈ సినిమాలో పవన్ రాబిన్‌హుడ్ తరహా పాత్రలో నటిస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే ఈ సినిమాను పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కించనున్నారనే వార్త ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో తెగ వినిపిస్తోంది.పవన్ మార్కెట్‌ను పూర్తిగా క్యాష్ చేసుకునేందుకు ఈ చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా భారీ ఎత్తున తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్ ప్రయత్నిస్తోందనే వార్త ఇండస్ట్రీలో వినిపిస్తోంది.

అయితే ఈ విషయానికి సంబంధించి ఎలాంటి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రాలేదు.కాగా ఈ సినిమాలో పవన్ సరసన హీరోయిన్‌గా బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫర్నాండెజ్ నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఈ సినిమాను తమిళ నిర్మాత ఏఎం రత్నం ప్రొడ్యూస్ చేస్తున్నాడు.మరి ఈ సినిమా నిజంగానే పాన్ ఇండియా మూవీగా వస్తుందా అనేది చూడాల్సి ఉంది.

#Krish #Pawan Kalyan #Pan India Movie

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Pawan Kalyan Krish Pan India Movie Pink Related Telugu News,Photos/Pics,Images..