నెలన్నరలో ముగించేస్తానంటోన్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ వకీల్ సాబ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ప్రేక్షకులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.దాదాపు రెండేళ్ల తరువాత పవన్ కళ్యాణ్ చిత్రం వస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని వారు ఆతృతగా ఉన్నారు.

 Pawan Kalyan Krish Movie To Finish Within 2 Months, Pawan Kalyan, Vakeel Saab, K-TeluguStop.com

అయితే ఈ సినిమా రిలీజ్ కాకముందే తన నెక్ట్స్ చిత్రాలను వరుసబెట్టి ఓకే చేస్తూ పవన్ కళ్యాణ్ దూసుకుపోతున్నాడు.ఈ క్రమంలోనే సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ క్రిష్ డైరెక్షన్‌లో ఓ పీరియాడికల్ మూవీని తెరకెక్కించేందుకు పవన్ రెడీ అయ్యాడు.

ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైన సంగతి తెలిసిందే.కాగా ఈ సినిమా కథ రాబిన్‌హుడ్ తరహాలో ఉండబోతున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.ఇక ఈ సినిమాకు సంబంధించి తాజాగా సినీ వర్గాల్లో ఓ టాక్ వినిపిస్తోంది.ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్‌ను జనవరి మొదటి వారంలో ప్రారంభిస్తారని, పవన్ ఈ షూటింగ్‌లో జాయిన్ కానున్నట్లు వార్తలు వినిపిస్తు్న్నాయి.

ఇక నెలన్నర రోజుల్లో ఈ సినిమా షూటింగ్‌ను ముగించేలా పవన్ ప్లాన్ చేశాడని, అందుకే ఈ సినిమాకు కేవలం నెలన్నర రోజులు మాత్రమే డేట్స్ ఇచ్చారని చిత్ర వర్గాలు అంటున్నాయి.అంటే కేవలం రెండు నెలల్లో ఈ సినిమా పూర్తిగా రిలీజ్‌కు రెడీ అవుతుందని చిత్ర వర్గాలు అంటున్నాయి.

మరి నిజంగానే పవన్ కళ్యాణ్ కేవలం రెండు నెలల్లో తన నెక్ట్స్ సినిమాను రిలీజ్‌కు రెడీ చేస్తాడా అనేది ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.ఇక ఈ సినిమాలో పవన్ లుక్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేయడం ఖాయమని, ఈ సినిమాతో పవన్ మరోసారి బాక్సాఫీస్‌పై దండ యాత్ర చేయడం ఖాయమని చిత్ర యూనిట్ అంటోంది.

కాగా ఈ సినిమాలో పవన్ సరసన హీరోయిన్‌గా ఎవరు నటిస్తారా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఏదేమైనా ఇంత త్వరగా పవన్ సినిమాను రిలీజ్‌కు రెడీ చేస్తాడంటే అది ఖచ్చితంగా విశేషమనే చెప్పాలి.

ఇక పవన్ వకీల్ సాబ్ చిత్రం వేసవి కానుకగా రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube