పవన్ సినిమాలో రెండే.. మిగతాదంతే అదే!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దాదాపు రెండేళ్ల తరువాత వకీల్ సాబ్ చిత్రంతో సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తుండటంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాను బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘పింక్’కు రీమేక్‌గా తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.

 Bgm To Be Outstanding For Pawan Krish Movie, Pawan Kalyan, Krish, Bgm, Viroopaks-TeluguStop.com

ఇక వకీల్ సాబ్ ఫస్ట్ లుక్ పోస్టర్‌కు అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఎదురుచూస్తున్నారు.

కాగా ఈ సినిమా రిలీజ్ కాకముందే పవన్ తన నెక్ట్స్ మూవీని కూడా లైన్‌లో పెట్టేందుకు రెడీ అవుతున్నాడు.

డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో తన నెక్ట్స్ మూవీని ఓకే చేసిన పవన్, ఈ సినిమాను అఫీషియల్‌గా ప్రారంభించారు.కాగా ఈ సినిమా షూటింగ్‌ను త్వరలోనే ప్రారంభించాలని చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

అయితే ఈ సినిమాలో కేవలం రెండు పాటలు మాత్రమే ఉంటాయని చిత్ర యూనిట్ తెలిపింది.అవి కూడా కమర్షియల్ సాంగ్స్ కాకపోవడంతో పవన్ ఫ్యాన్స్ కాస్త నిరాశకు లోనయ్యారు.

అయితే ఈ సినిమాలో బ్యాక్‌‌గ్రౌండ్ మ్యూజిక్ ఓ రేంజ్‌లో ఉండబోతున్నట్లు తెలుస్తోంది.కీరవాణి అందిస్తున్న సంగీతంలో ఈ బీజీఎం మరో లెవెల్‌లో ఉంటుందని, సినిమాకు ఇది మేజర్ ప్లస్ పాయింట్‌గా మారనుందని తెలుస్తోంది.

మొత్తానికి కీరవాణి ఈ సినిమాకు అందించే సంగీతం సినిమాకు అదనపు బలం కానుండటంతో ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఇక ఈ సినిమాకు విరూపాక్ష అనే టైటిల్‌ను పెట్టాలని చూస్తున్నారు.

మరి ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు ప్రారంభం అవుతుందో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube