వచ్చే ఎన్నికల్లో పవనే కీలకం..పక్కా లెక్క ఇదే

గత ఏడాది ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ని ఎలా ఉపయోగించుకుని అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ తమపై విమర్శలు ఎక్కుపెట్టిన తరుణం మొదలు అసలు అతడి వల్ల మేము అధికారంలోకి రాలేదు అతడి వల్ల మాకు కలిసోచిన అంశం ఒక్కటి కూడా లేదు అంటూ బహిరంగంగా విమర్శలు చేశారు.అయితే తెలుగుదేశం విజయం అనేది ఎలా వచ్చింది అనే విషయం అందరికీ తెలిసినదే అయితే వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కి భంగ పాటు తప్పదు అతని అన్న లాగే మూట ముల్లి సర్దేసుకోవడమే అంటూ తెలుగుదేశం నేతలు కామెంట్స్ చేస్తున్నారు.

 Pawan Kalyan King Maker In 2019 Elections-TeluguStop.com

కానీ 2019 లో పవనే కింగ్ మేకర్ అవుతాడని రాజకీయ పండితులు పక్కగా చెప్తున్నారు.వివరాలలోకి వెళ్తే.

జనసేన అధికారంలోకి రావటం ఖాయమని తాను ముఖ్యమంత్రి అవ్వటం అంతకన్నా ఖాయంగా పవన్ పడే పడే అనడం కార్యకర్తల్లో ఉత్తేజాన్ని నింపడంలో భాగమే తప్ప జనసేన కి అంత సీన్ లేదని అయితే ఏ పార్టీ అధికారంలోకి వస్తుందన్న విషయంలో మాత్రం జనసేన కీలకపాత్ర పోషించే అవకాశాల ఎక్కువ అని అంటున్నారు జనసేన మొత్తం 175 సీట్లలోనూ పోటీ చేస్తానని తెలిపింది అయితే ఎన్ని సీట్లలో పోటీ చేస్తుందనేడి పక్కన పెడితే.ఎన్ని స్ధానాల్లో గెలుస్తుందన్న విషయమే చాలా కీలకం.ఇక్కడే మిగిలిన పార్టీలు వేటికవే జనసేన పార్టీ పేరు చెప్తేనే ఉలిక్కిపడుతున్నాయి.ఎందుకంటే.

జనసేన పోటీ చేసిన అన్నీ సట్లలోనూ గెలిచే సత్తా జనసేనకు లేకపోయినా చాలా సీట్లలో గెలుపోటములను డిసైడ్ చేయగలదు గట్టిగా చెప్పాలంటే జనసేన బలంపై ఏ పార్టీకి స్పష్టమైన అవగాహన లేదన్నది వాస్తవం.అందుకే అన్నీ పార్టీల్లో జనసేన అంటే ఒక రకమైన కన్ఫ్యూజన్ ఏర్పడింది.

అయితే కాపు నేతల లెక్కల ప్రకారం అన్ని జిల్లాలలో పోల్చుకుంటే దాదాపు 60 నియోజకవర్గాల్లో ఏ పార్టీ అభ్యర్ధి గెలవాలన్నా కాపుల ఓట్లే అత్యంత కీలకంగా ఉంటాయి.అయితే తనని ఏ ఒక్క సామాజికవర్గానికో పరిమితం చేయొద్దని, తాను అందరి వాడినని పవన్ పైకి ఎన్ని మాటలు చెబుతున్నా కాపుల ఓట్లనే లక్ష్యంగా చేసుకున్న విషయం ఆచరణలో తెలిసిపోతోంది.

అంతేకాదు వచ్చే ఎన్నికల్లో కాపులకి అధికశాతం ఓట్లు కూడా పవన్ కళ్యాణ్ కేటాయిస్తారు అంతేకాదు ప్రతీ నియోజక వర్గానికి కాపుల ఓట్లు తప్పకుండా 15 వేలు ఉంటాయి అంటే నియోజకవర్గానికి సగటున 2 లక్షల ఓట్లుంటే అందులో కాపుల ఓట్లే 15 వేలుంటాయి.ఏ నియోజకవర్గంలో కూడా నూటికి నూరు శాతం ఓట్లు పోలుకావు.సగటున సుమారు 1.7 లక్షల ఓట్లు పోలైతే చాలా ఎక్కువ…అయితే జనసేన కి ఓట్లు వేసుకోవాలని కాపులు ఎంతో తహ తహ లాడుతున్నారు ఈ క్రమలోనే మొదటి సారిగా ప్రత్యక్ష ఎన్నికల్లో దిగిన జనసేనకి తప్పకుండా కాపులు ఓట్లు వేస్తారు.

అయితే ఇదే సమయంలో జనసేన ఓట్లు గెలవకున్నా అభ్యర్ధుల గెలుపుని శాసించే స్థాయికి వెళ్తుంది చాలా నియోజకవర్గాల్లో ఇతర పార్టీల గెలుపోటములు జనసేనపైనే ఆధారపడుందన్నది స్పష్టమవుతోంది.ఈ లెక్కలన్నీ కూడా జనసేన ఒంటరిగా పోటీ చేస్తేనే జరుగుతాయి ఒకవేళ పవన్ కల్యాణ్ గనుక వేరే పార్టీతో జట్టు కడితే సమీకరణలన్నీ మారిపోవటం ఖాయం.

ఈ సమీకరణాలు అన్ని ఒక్కసారిగా తలకిందులు అవుతాయి మరి జనసేన ఒంటరి పోరు చేస్తుందా లేక కలిసి ఎన్నికల్లో దిగుతుందా అనేది మాత్రం సస్పెన్స్ గా ఉన్నా తప్పకుండా వచ్చే ఎన్నికల్లో మాత్రం చక్రం తిప్పుంది అనడంలో సందేహం లేదు అంటున్నారు పరిశీలకులు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube