తెలుగు చలన చిత్ర పరిశ్రమలో టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్నటువంటి క్రేజ్ మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే పవన్ కళ్యాణ్ నటించిన చిత్రాలలో ఎక్కువ శాతం చిత్రాలు డిజాస్టర్లుగా నిలిచినప్పటికీ పవన్ కళ్యాణ్ యొక్క యాటిట్యూడ్ మరియు విపత్కర సమయంలో స్పందించే తీరు వంటి వాటి కారణంగా గా పవన్ కళ్యాణ్ కి అభిమానులకంటే భక్తులు ఎక్కువగా ఉంటారని సినిమా ఇండస్ట్రీలో టాక్ ఉంది.
అయితే గత కొద్ది కాలంగా పవన్ కళ్యాణ్ వారసుడు అకిరా నందన్ సినిమాల్లోకి హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడనే విషయంపై ఆసక్తి గా చర్చలు జరుగుతున్నాయి.
అయితే ఇప్పటికీ అకీరా నందన్ ఎంట్రీపై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రం ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.
కాగా తాజాగా పవన్ కళ్యాణ్ అకీరా నందన్ ని సంగీతం నేర్చుకునేందుకు ఓ ప్రముఖ గాయని సంగీత ఇన్స్టిట్యూట్లో చేర్పించినట్లు సమాచారం.ఇందులో భాగంగా ఇటీవలే ఈ విషయానికి సంబంధించి నటువంటి ఓ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతోంది.
దీంతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు.అంతేకాకుండా తొందర్లోనే అకీరా నందన్ హీరో ఎంట్రీ ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
అయితే ఈ ఫోటోని ఒకసారి పరిశీలించినట్లయితే అకీరా నందన్ ఇప్పటికే ఆరడుగుల ఎత్తు కంటే ఎక్కువ పెరిగినట్లు తెలుస్తోంది.దీంతో ఇప్పటి వరకు ఉన్నటువంటి మెగా హీరోలను ఎత్తు విషయంలో అకీరా నందన్ మించిపోయాడని కొందరు పవర్ స్టార్ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా రాజకీయాల కారణంగా దాదాపు మూడేళ్ళపాటు సినిమాలకు దూరంగా ఉన్న పవన్ కళ్యాణ్ ఈ ఏడాది వకీల్ సాబ్ చిత్రంతో మళ్ళీ హీరో గా ఎంట్రీ ఇచ్చాడు.వచ్చి రావడంతోనే వకీల్ సాబ్ చిత్రం మంచి హిట్ అవడంతో వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు.కాగా ప్రస్తుతం పవన్ కళ్యాణ్ “హరిహర వీరమల్లు” అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.ఈ చిత్రానికి టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నాడు.