జేడీ గారి చూపంతా వైసీపీ పైనే ? ఎంట్రీ ఎప్పుడో ?

ఏపీ రాజకీయాలు ఎప్పుడు రసవత్తరంగా ఉంటూనే వస్తున్నాయి.ముఖ్యంగా ఏపీ అధికార పార్టీ వైసీపీలోకి నాయకుల వలసల విషయంలో పెద్ద హడావుడినే చాలా కాలంగా జరుగుతూ వస్తోంది.

 Jd Laxmi Narayana Want To Join In Ysrcp Party, Janasena, Pawan Kalyan, Jd Laxmi-TeluguStop.com

టిడిపికి చెందిన కీలక నాయకులంతా వైసీపీలోకి క్యూ కడుతున్నారు.ఇంకా అనేకమంది సిద్ధంగా ఉన్నా, జగన్ వారికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడంతో తాత్కాలికంగా వాయిదా పడింది.

క్రమక్రమంగా టిడిపిని బలహీనం చేసే ఈ విషయంపైనే ఇప్పుడు వైసీపీ మొత్తం ఫోకస్ అంతా పెట్టింది.ఇది ఇలా ఉంటే జనసేన మాజీ నాయకుడు సి.

బి.ఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వి.వి లక్ష్మీనారాయణ వ్యవహారం ఇప్పుడు మరోసారి తెరమీదకు వచ్చింది.ఆయన జనసేన పార్టీ విధానాలు నచ్చక ఆ పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చేసిన సంగతి తెలిసిందే.

ఇక అప్పటి నుంచి ఆయన బీజేపీలో చేరతారని ప్రచారం జరిగినా, దానిని ఆయన ఖండించారు.ఆయన ఏ పార్టీలో చేరుతారనేది ఇప్పటి వరకు క్లారిటీ లేకుండానే ఉంది.

కాకపోతే ఆయన తరచుగా వైసీపీ అధినేత సీఎం జగన్ ను పదేపదే పొగుడుతూ వస్తున్నారు.వైసీపీ ప్రభుత్వ విధానాలు ప్రజలకు మేలు చేసేవిగా ఉన్నాయని, జగన్ సమర్థవంతంగా పరిపాలిస్తున్నారు అని చెబుతున్నారు.

అక్కడితో ఆగకుండా, జగన్ అక్రమాస్తుల కేసుల వ్యవహారం లో అప్పట్లో విచారణ అధికారిగా తన ఉద్యోగ బాధ్యతలు మాత్రమే నిర్వర్తించానని, అంతకుమించి వ్యక్తిగత ద్వేషం ఏమీ లేదంటూ అనేక సందర్భాల్లో చెప్పారు.

Telugu Jagan, Janasena, Jd Laxmi Yana, Jd Praise Jagan, Pawan Kalyan, Ysrcpwelfa

గత కొద్ది రోజులుగా జె.డి వైసీపీలో చేరేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు పంపిస్తున్నట్టు వైసిపి లో చర్చ జరుగుతోంది.ఆయనను పార్టీలో చేర్చుకుంటే పరిస్థితులు ఎలా ఉంటాయి ? గతంలో సిబిఐ జాయింట్ డైరెక్టర్ గా ఆయన ఉన్న సమయంలో పెద్ద ఎత్తున ఆయనపై విమర్శలు చేశామని, వైసీపీ కి ఒక రకంగా ఆయన బద్ధశత్రువు అని, అటువంటి వ్యక్తిని పార్టీలో చేర్చుకుంటే క్యాడర్ లో ఏమైనా అసంతృప్తి కలుగుతుందా అనే విషయాలపై వైసిపి దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.

కాకపోతే జేడీ వస్తానని ఇప్పటి వరకు స్పష్టంగా చెప్పకపోవడంతో, ఆయన దీనిపై స్పందించిన తర్వాతే తన రియాక్షన్ ఏంటనేది చెప్పాలి అన్నట్లుగా వైసిపి ఉంది.ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో జేడీ లక్ష్మీనారాయణ వైసిపి వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నట్లుగా తెలుస్తోంది.

మరి దీనిపై జగన్ రియాక్షన్ ఏ విధంగా ఉంటుందో ?

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube