మార్పు మొదలయ్యిందా ? జనసేన సరికొత్తగా సిద్ధమవుతోందా ?  

Pawan Kalyan Janasena Wants Go In To The People With New Trend-

చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టుగా ఎన్నికల తంతు ముగిసిన చాలా నెలల తరువాత జనసేన పార్టీలో ఉన్న లోపాలు ఏంటి అనే విషయాన్ని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గుర్తించారు.ఎన్నికల్లో ప్రధాన పార్టీలుగా ఉన్న తెలుగుదేశం, వైసీపీ పార్టీలను ఎన్నికల్లో ఎదుర్కొనేందుకు సరైన బలం, బలగం లేకుండా ముందుకు వెళ్లి ఓటమి చెందామని, ముందు నుంచే పటిష్టమైన నాయకులను తయారుచేసుకుని ఎన్నికలకు వెళ్తే మెరుగైన ఫలితాలు వచ్చి ఉండవనే విషయాన్ని పవన్ కొంతమంది కీలక నాయకుల దగ్గర వ్యాఖ్యానిస్తున్నాడట.ఇప్పటికే చాలా సందర్భాల్లో జనసేన ఓటమికి నాయకత్వ లోపమే కారణం అనే విషయాన్ని బహిరంగంగానే పవన్ ప్రస్తావించాడు...

Pawan Kalyan Janasena Wants Go In To The People With New Trend--Pawan Kalyan Janasena Wants Go In To The People With New Trend-

ఇక ముందు ముందు అటువంటి తప్పులు తలెత్తకుండా పటిష్టమైన నాయకులతో సరికొత్త పంథాలో ముందుకు వెళ్తే వచ్చే ఎన్నికల నాటికి అధికారం చేజిక్కించుకునే అంత స్థాయిలో బలపడవచ్చనే అంచనాకు పవన్ వచ్చినట్టు కనిపిస్తోంది.

Pawan Kalyan Janasena Wants Go In To The People With New Trend--Pawan Kalyan Janasena Wants Go In To The People With New Trend-

పార్టీ పెట్టినప్పటి నుంచి పవన్ చెబుతున్న మాట ఏదైనా ఉందా అంటే అది పార్టీ లో కొత్త రక్తాన్ని నింపుతామని, మిగతా పార్టీల్లా రాజకీయం చేయబోమని, చరిత్ర సృష్టించే పార్టీగా జనసేన ఉంటుందని ఇలా ఎన్నో చెప్పాడు.కానీ, ఎన్నికల సమయం వచ్చేసరికి.చాలామంది కొత్తవారికే సీట్లు కేటాయించారు.

ఇతర పార్టీల నుంచి వచ్చిన కొందర్ని చేర్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.అంతేకాదు, వివిధ రంగాలకు చెందిన కొందరు సీనియర్లను కూడా చేర్చుకుని టిక్కెట్లు కేటాయించారు.ఇక్కడే కొన్ని తప్పిదాలు జరిగాయని జనసేనాని గుర్తించారట..

అందుకే, కొత్త నాయకత్వాన్ని ఇప్పట్నుంచే తయారు చేసుకోవాలనేది ఆయన వ్యూహంగా తెలుస్తోంది.ప్రతీ నియోజక వర్గం నుంచి ముగ్గురు నాయకులను చొప్పున సిద్ధం చేయాలని ఆలోచిస్తున్నారని సమాచారం.అలాగే రాష్ట్రంలో నెలకొన్న సమస్యలు, ప్రజలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని సమస్యల్ని ఎప్పటికప్పుడు గుర్తించడం కోసం ఐదుగురు సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేయాలనీ దాని ద్వారా ఎప్పుడు ఏమి చేయాలనే విషయాన్నీ పవన్ దృష్టికి తీసుకువచ్చే విధంగా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.

ఇక నియోజకవర్గాల్లో కూడా బలమైన నాయకులను ఇప్పటి నుంచే తయారుచేసుకుని వారికి టికెట్ ఇవ్వాలని పవన్ ఆలోచనట.ఎందుకంటే గత ఎన్నికల్లో జనసేన తరఫున పోటీకి దిగిన దాదాపు అందరు అభ్యర్థులూ వ్యక్తిగతంగా అంతగా గుర్తింపు లేనివారే.వారంతా కేవలం పవన్ ఇమేజ్ ను నమ్ముకుని మాత్రమే ముందుకు సాగారు.దీంతో ఫలితాలు నిరాశపరిచాయి.

కానీ వచ్చే ఎన్నికల నాటికి ఈ పరిస్థితి ఉండకూడదని, జనసేన తరఫున ప్రతీ నియోజక వర్గంలో కీలకంగా వ్యవహరించేవారుండాలనీ, అది కూడా వీలైనంత మంది యువతకు అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో ఇప్పట్నుంచీ పవన్ అన్నిరకాల ఏర్పాట్లు చేస్తున్నాడు.దీనిలో భాగంగానే ఇప్పటి నుంచే ప్రతి నియోజకవర్గం నుంచి ఓ ముగ్గురు బలమైన నాయకులను తయారుచేసుకుని వారిలో ఎవరికి ఎక్కువ ప్రజాదరణ ఉంటుందో వచ్చే ఎన్నికలనాటికి గుర్తించి వారికి టికెట్ ఇవ్వాలని పవన్ ప్లాన్ చేస్తున్నాడు.