పాతిక సీట్లే ల‌క్ష్యంగా ప‌వ‌న్ పోరాట యాత్ర‌!

రాజ‌కీయ నేత‌లు ఏం చేస్తున్నా.ఒక‌ప్పుడు ఎవ‌రు ప‌ట్టించుకుంటారులే.

 Pawan Kalyan Janasena Uttarandhra-TeluguStop.com

అనుకునేవారు.కానీ, నేడు విస్తృత ప్ర‌సార మాధ్య‌మాలు, విస్తృత మీడియా పుణ్య‌మాని.

రాజ‌కీయాల్లో ఉన్న నాయ‌కులు ఏ క్ష‌ణాన ఏం చేస్తున్నా.జ‌నాల‌కు ఇట్టే స‌మాచారం చేరిపోతోంది.

దీంతో అదేస‌మ‌యంలో ఆయా నాయ‌కుల‌పై స‌టైర్లూ అంతే వేగంగా పేలుతున్నాయి.ప్ర‌స్తుతం జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై కూడా ఇప్పుడు నెటిజ‌న్లు ఇలానే స‌టైర్ల‌తో కుమ్మేస్తున్నారు.

రాష్ట్రంలో మొత్తం 13 జిల్లాలు ఉండ‌గా.ప‌వ‌న్ మాత్రం కేవ‌లం ఉత్త‌రాంధ్ర‌లోని మూడు జిల్లాల‌నే ఎంచుకుని ప్ర‌జా పోరాట యాత్ర పేరిట 45 రోజుల షెడ్యూల్‌ను నిర్ణ‌యించుకుని ప‌ర్య‌టించ‌డంపై నెటిజ‌న్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.

ప‌వ‌న్.ఉత్త‌రాంధ్ర హీరో! అంటూ కొంద‌రు వ్యాఖ్యానిస్తే.మ‌రికొంద‌రు జ‌న‌సేన.ఉత్త‌రాంధ్ర పార్టీ అంటూ సెల‌విస్తున్నారు.నిజానికి మ‌రో 10 మాసాల్లోనే ఎన్నిక‌లు ఉన్నాయి.దీంతో జ‌న‌సేన వంటి పుట్టి క‌న్నుతెర‌వ‌ని పార్టీ అన్ని జిల్లాల‌నుఓన్ చేసుకునే విధంగా ప‌క్కా కార్య‌చ‌ర‌ణ‌తో ముందుకు సాగాలి.

ఇప్ప‌టికే ప్ర‌జ‌ల్లో ఉన్న వైసీపీ, అధికార టీడీపీలు.కేవ‌లం ఒక‌టి రెండు జిల్లాల‌కే ప‌రిమితం కాకుండా.

అన్ని జిల్లాల్లోనూ త‌మ‌హ‌వాను ప్ర‌ద‌ర్శించేందుకు ప‌క్కా వ్యూహంతో ముందుకు సాగుతున్నారు.అధికారంలో ఉండి కూడా టీడీపీ అధినేత చంద్ర‌బాబు ప్ర‌తి జిల్లాలోనూ నిత్యం ఏదో ఒక కార్య‌క్ర‌మం పేరుతో విజృంభిస్తున్నారు.

మ‌రి ఇప్ప‌టికీ పార్టీ నిర్మాణ‌మే లేని జ‌న‌సేనాని ప‌వ‌న్ కేవ‌లం ఉత్త‌రాంధ్ర‌కే ప‌రిమితం కావ‌డం, అక్క‌డ‌క్క‌డే రోజుల త‌ర‌బ‌డి మ‌కాం వేయ‌డం వంటి ప‌రిణామాలు.జ‌న‌సేన‌ను ఉత్త‌రాంధ్ర పార్టీగానే ప‌రిగ‌ణించాల్సి వ‌స్తుంద‌ని అంటున్నారు సోష‌ల్ మీడియాలో నెటిజ‌న్లు.

అయితే, ప‌వ‌న్ ప‌ర్య‌ట‌న‌పై సోష‌ల్ మీడియాలో వ‌స్తున్న స‌టైర్ల‌కు జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు, వ్యూహ క‌ర్త‌లు త‌మ‌దైన శైలిలో జ‌వాబు చెబుతుండ‌డం గ‌మ‌నార్హం.ఉత్తరాంధ్ర పర్యటనలో వున్న జనసేన అధినేత పవన్‌కళ్యాణ్.

వ్యూహాత్మకంగా కదులుతున్నారని అంటున్నారు.

ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రంలో ప్ర‌ధాన పార్టీలు క‌లియ‌దిర‌గ‌ని అరకు, పాడేరు మధ్య గిరిజన ప్రాంతాల్లో కలియతిరుగుతూ ప్ర‌త్యేక‌త‌ను చాటుకుంటున్నార‌ని చెబుతున్నారు.

నాయ‌కులు స్పృశించ‌ని గిరిజ‌న స‌మ‌స్య‌ల‌ను త‌మ‌నేత తెలుసుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని అంటున్నారు.అదేస‌మ‌యంలో స్థానిక కీలక నేతలతో ఆయన వరుస భేటీలు నిర్వహిస్తూ రాజకీయ వ్యూహ నిర్మాణంలో నిమగ్నమైనట్లు చెబుతున్నారు.

స్థానిక సమస్యల మీద అధ్యయనం చేయడంతో పాటు.ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక లాంటి కీలక అంశాలపై కూడా పవన్ మంతనాలు జరుపుతున్నారని చూచాయ‌గా వెల్ల‌డిస్తున్నారు.

నిజానికి సీమ తర్వాత, ఉత్తరాంధ్రలోనే జనసేనకు ఎక్కువ ఫాలోయింగ్ ఉంద‌ని, ఆ మూడు జిల్లాల్లో బలపడ్డానికి అవసరమైన ఏర్పాట్లన్నీ పవన్ సిద్ధం చేస్తుకుంటున్నారని వారు వివ‌రిస్తున్నారు.సో.మొత్తానికి ప‌వ‌న్ వ్యూహం వ‌ర్క‌వుట్ అయితే.దాదాపు 25 సీట్లు ఆయ‌న‌కే సొంతం అవుతాయేమో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube