ఉత్తరాంద్రపై జనసేనాని స్పెషల్ ఫోకస్... ఎన్ ఛార్జ్ ల నియామకం

త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న నేపధ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ నిర్మాణం మీద ద్రుష్టి పెట్టాడు.ఇందులో భాగంగా కీలక నిర్ణయం తీసుకున్నాడు.

 Pawan Kalyan Janasena Utharandhra Andhra Pradesh-TeluguStop.com

ఉభయ గోదావరి జిల్లాలతో పాటు, ఉత్తరాంద్ర మూడు జిల్లాలకి ఇన్ చార్జ్ లని ఖరారు చేశారు.అలాగే ఉత్తరాంద్ర పార్టీ కార్యక్రమాలని పర్యవేక్షణ చేయడానికి ఐదుగురు సభ్యులతో కమిటీని కూడా నియమించారు.

అదే సమయంలో విశాఖ, శ్రీకాకుళం విజయనగరం, తూర్పు గోదావరి, గుంటూరు, చిత్తూరు జిల్లాలకి నియోజక వర్గాల వారీగా ఇన్ చార్జ్ లని ఖరారు చేశారు.ఇక విశాఖ పార్లమెంట్ ఇన్ చార్జ్ గా వివి లక్ష్మినారాయణకి కీలక బాద్యతలని అప్పగించారు.

ఇక ఈ పర్యవేక్షక కమిటీ రేపటి నుంచి పార్టీ సంస్థాగత నిర్మాణం మీద దృష్టి పెట్టనున్నారు.ఇప్పటికే దీనికి సంబందించిన కార్యాచరణని పార్టీ సిద్ధం చేసినట్లు తెలుస్తుంది.

స్థానిక సంస్థల ఎన్నికలని దృస్టిలో పెట్టుకొని మండల, గ్రామ స్థాయి కమిటీలు కూడా ఏర్పాటుకి రంగం సిద్ధమైంది.ముందుగా ఉత్తరాంద్రలో సమన్వయ కమిటీ కమిటీల ఏర్పాటుపై కసరత్తు చేయనుంది.

దీనిపై నియోజకవర్గ, మండల స్థాయిలో సమావేశాలు నిర్వహించడానికి కూడా రెడీ అయ్యింది.గత కొద్ది రోజులుగా జనసేన పార్టీ స్టాండ్ కి వ్యతిరేకంగా సొంత అజెండాతో వెళ్తున్న రాపాక వరప్రసాద్ కి రాజోలు నియోజక వర్గ బాద్యతలని జనసేనాని అప్పగించారు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube